సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఢిల్లీలో ఈ నెల 19న 2024, 2025 సంవత్సరాల ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాల ప్రదానం

అవార్డులను ప్రదానం చేయనున్న కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్‌

నాడు పోస్టు చేయడమైనది: 16 OCT 2026 6:39PM by PIB Hyderabad

2024, 2025 సంవత్సరాలకు సంబంధించిన ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాల ప్రదానోత్సవం 2026 అక్టోబర్‌ 19న ఉదయం 10 గంటలకు న్యూఢిల్లీలోని రవీంద్ర భవన్‌ ప్రాంగణంలో ఉన్న మేఘదూత్‌ కాంప్లెక్స్‌లో జరుగుతుంది. సంగీతం, నృత్యం, నాటక రంగాల్లో ప్రతిభ కనబరిచిన 106 మంది యువ కళాకారులకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్‌ ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. 

ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ వివేక్‌ అగర్వాల్‌ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. సంగీత నాటక అకాడమీ ఛైర్మన్‌ డాక్టర్‌ సంధ్యా పురేచా అధ్యక్షత వహిస్తారు. 

40 ఏళ్లలోపు యువ కళాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు సంగీత నాటక అకాడమీ 2006లో ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలను ప్రారంభించింది. అప్పటి నుంచి ఏటా ప్రత్యేక కార్యక్రమంలో యువ కళాకారులకు ఈ పురస్కారాలను ప్రదానం చేస్తున్నారు.

న్యూఢిల్లీలో 2026 మార్చి 22 నుంచి 26 వరకు జరిగిన సంగీత నాటక అకాడమీ జనరల్‌ కౌన్సిల్‌ సమావేశంలో 2024, 2025 సంవత్సరాలకు గానూ ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాల కోసం 106 మంది యువ కళాకారులను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.

ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం కింద రూ.25,000 నగదు బహుమతితో పాటు తామ్రపత్రం, శాలువా అందజేస్తారు.

List of Awardees

***


(రిలీజ్ ఐడి: 2324566) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी