ప్రధాన మంత్రి కార్యాలయం
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మాత కాత్యాయనిని పూజించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
16 OCT 2026 10:39AM by PIB Hyderabad
నవరాత్రి ఉత్సవాలలో పవిత్ర షష్ఠి రోజున మాత కాత్యాయనిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అర్చించారు.
దేవీ మాత ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో అనంత శక్తి, ధైర్య సాహసం, సకారాత్మక సామర్థ్యం సిద్ధించాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘నవరాత్రి ఉత్సవాల్లో పవిత్రమైన షష్ఠి రోజు ఈ రోజు.. మాత కాత్యాయని శ్రీచరణాలకు కోటి కోటి ప్రణామాలు. దేవీమాత కృపతో ప్రతి ఒక్కరి జీవితంలో అనంత శక్తి, సాహసం, సకారాత్మక సామర్థ్యం సిద్ధించాలని అభిలషిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2324303)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam