బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రత్యేక క్యాంపెయిన్-6లో భాగంగా పారిశుద్ధ్య, ఈ-వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్న బొగ్గు మంత్రిత్వశాఖ

నాడు పోస్టు చేయడమైనది: 15 OCT 2026 4:05PM by PIB Hyderabad

ప్రత్యేక ప్రచార కార్యక్రమం-6 అమల్లో భాగంగా తన పరిధిలోని కార్యాలయాలు, ప్రభుత్వ రంగం సంస్థలు అన్నింటిలోనూ పారిశుద్ధ్యం, స్థలాన్ని సమర్థంగా వినియోగించుకోవడం, బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించే ప్రయత్నాలను బొగ్గు మంత్రిత్వశాఖ ముమ్మరం చేసింది.

న్యూఢిల్లీలోని జీపీవోఏ-3 లాబీ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కియోస్క్ వద్ద ఈ-వ్యర్థాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి, బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే పాల్గొన్నారు. పనికిరాని ఎలక్ట్రానిక్ వస్తువులను ఈ కియోస్క్‌లో డిపాజిట్ చేశారు. పర్యావరణ సుస్థిరత, వనరుల సామర్థ్యాన్ని పెంపొందించడంలో బాధ్యతాయుతమైన ఈ-వ్యర్థాల పారవేత, వ్యవస్థీకృత సేకరణ, శాస్త్రీయ విధానంలో రీసైక్లింగ్‌కు ఉన్న ప్రాధాన్యాన్ని ఈ కార్యక్రమం తెలియజెప్పింది.

ఈ ప్రచార పురోగతిని సమీక్షించడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ సమావేశాన్ని నిర్వహించింది. దీనిలో కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), దాని  అనుబంధ సంస్థలు, ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్‌సీఐఎల్), సింగరేణి  కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్), కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (సీఎంపీఎఫ్‌వో)‌కు చెందిన నోడల్ అధికారులు పాల్గొన్నారు. కొనసాగుతున్న కార్యకలాపాల స్థితిని అంచనా వేయడంతో పాటు అమలును వేగవంతం చేయడం, వేగాన్ని కొనసాగించడం, గుర్తించిన అన్ని పనులను నిర్దేశిత కాల వ్యవధిలో పూర్తిచేయడంపై ఈ సమీక్షలో దృష్టి సారించారు. భాగస్వామ్య సంస్థలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసి, ప్రచార లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసేలా చొరవ తీసుకోవాలని బొగ్గు మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ సంజీవ్ కుమార్ కస్సీ పిలుపునిచ్చారు.

ప్రత్యేక ప్రచారం – 6 ద్వారా పారిశుద్ధ్యం, స్థల నిర్వహణలో బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని సీపీఎస్ఈలు గణనీయమైన పురోగతిని సాధించాయి. ఈ కార్యక్రమ నిర్దేశిత కాల పరిమితి సగం పూర్తయ్యే నాటికి 562 స్థలాలను శుభ్రం చేసి వాటి రూపురేఖలను మార్చారు. పనిప్రదేశాల్లోని వాతావరణాలను మెరుగుపరచడం, నిరుపయోగంగా ఉన్న, వ్యర్థాలు పేరుకున్న ప్రదేశాలను శుభ్రం చేయడం, కార్యాలయాలు, క్షేత్రస్థాయి సంస్థల్లో మౌలిక వసతులను మెరుగ్గా ఉపయోగించుకోవడం పట్ల నిబద్ధతను ఈ చర్యలు ప్రతిబింబిస్తాయి.

ముందు

తర్వాత

 

పాండవేశ్వర్ ప్రాంతంలోని 15,000 చదరపు అడుగుల స్థలాన్ని శుభ్రం చేసి, సుందరీకరించే సమగ్ర కార్యక్రమాన్ని ఈసీఎల్ చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా పిచ్చి మొక్కలు, పొదలు, కలుపు మొక్కలు, పేరుకుపోయిన చెత్తను తొలగించారు. దీంతో ఈ ప్రదేశంలో శుభ్రత, భద్రత, రూపురేఖలు మెరుగయ్యాయి.

 

 

 

 

ముందు

తర్వాత

 

డబ్ల్యూసీఎల్: ప్రత్యేక క్యాంపెయిన్-6లో భాగంగా డబ్ల్యూసీఎల్‌ ప్రధాన కార్యాలయంలో అంతగా వినియోగంలో లేని ప్రదేశాన్ని ఆధునికంగా, వ్యవస్థీకృతమైన కార్పొరేట్ సెక్యూరిటీ కార్యాలయంగా సెక్యూరిటీ విభాగం మార్చింది. ఈ ప్రయత్నం అందుబాటులో ఉన్న మౌలిక వసతులను సమర్థంగా వినియోగించుకోవడాన్ని తెలియజేస్తోంది.

ఈ సమష్టి ప్రయత్నాల ద్వారా స్వచ్ఛతా డ్రైవ్‌లను, శాస్త్రీయ విధానంలో వ్యర్థాల నిర్వహణను, అందుబాటులో ఉన్న స్థలాన్ని ఉత్పాదక  రీతిలో ఉపయోగించుకోవడాన్ని అనుసంధానించి ప్రత్యేక క్యాంపెయిన్-6.0 లక్ష్యాలను బొగ్గు మంత్రిత్వశాఖ, దాని సీపీఎస్ఈలు ముందుకు తీసుకెళుతున్నాయి. బొగ్గు రంగం అంతటా పరిశుభ్రత, జవాబుదారీతనం, కార్యాచరణ సామర్థ్యం అనే సంస్కృతిని ఈ ప్రచారం కొనసాగిస్తుంది.

***


(రిలీజ్ ఐడి: 2324185) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी