యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
వికసిత్ భారత్ వ్యాసరచన పోటీలో వ్యాసాల సమర్పణ గడువు అక్టోబర్ 22 వరకు పొడిగింపు
నాడు పోస్టు చేయడమైనది:
15 OCT 2026 5:06PM by PIB Hyderabad
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న యువత భాగస్వామ్య కార్యక్రమం ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ (వీబీవైఎల్డీ)-2027’కు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించిన వికసిత్ భారత్ క్విజ్లో మొత్తం 1,45,26,013 మంది ప్రయత్నాలు నమోదయ్యాయి. ఈ క్విజ్ దశలో అర్హత సాధించిన సుమారు 5.7 లక్షల మంది యువత తదుపరి దశ అయిన ‘వికసిత్ భారత్ వ్యాసరచన పోటీ’కి ఎంపికయ్యారు. ఈ దశలో వారు తమ ప్రాంతానికి నిర్దేశించిన అంశంపై 500 పదాలకు మించకుండా వ్యాసం రాసి, ‘మై భారత్’ వేదికలో సమర్పించాల్సి ఉంటుంది.
వికసిత్ భారత్ వ్యాసరచన పోటీలో రెండో దశ వ్యాసాల సమర్పణ గడువును 2026 అక్టోబర్ 22 వరకు యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పొడిగించింది. దీనివల్ల వీబీవైఎల్డీ 2027లో పాల్గొనేందుకు అర్హులైన యువత తమ వ్యాసాలను సమర్పించేందుకు మరింత సమయం లభిస్తుంది.
ఇప్పటివరకు వ్యాసాలు సమర్పించని అర్హులైన యువత అక్టోబర్ 22 లోగా తమ వ్యాసాలను సమర్పించాలని మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ గడువు పొడిగింపు వల్ల అర్హులైన పాల్గొనే వారికి వ్యాసాలు సమర్పించేందుకు అదనపు సమయం లభించడంతో పాటు, జాతీయ కార్యక్రమంలో మరింత మంది పాల్గొనేందుకు అవకాశం కలుగుతుంది.
సవరించిన గడువు వివరాలను అర్హులైన యువతకు తెలియజేయాలని, జిల్లా అధికారులతో పాటు ఇతర సంబంధిత వర్గాలకు సకాలంలో సమాచారం అందేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా యంత్రాంగాలను కూడా మంత్రిత్వ శాఖ కోరింది.
వీబీవైఎల్డీ–2027 ద్వారా యువత భాగస్వామ్యం, నాయకత్వ లక్షణాలు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడమే మంత్రిత్వ శాఖ లక్ష్యం. 2047 వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగస్వాములయ్యేందుకు యువతకు ఈ కార్యక్రమం ఒక వేదికను అందిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2324178)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11