ప్రధాన మంత్రి కార్యాలయం
రాజమాత విజయరాజే సింధియా జీకి నివాళులు అర్పించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
12 OCT 2026 11:09AM by PIB Hyderabad
రాజమాత విజయరాజే సింధియా గారి జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాజమాతకు నివాళులు అర్పించారు. దేశానికి సేవ చేయడంలో ఆమె త్యాగం, అంకిత భావం అందరికీ స్ఫూర్తిదాయకమని, ఆమె ఆదర్శాలు, ఆమె ఆలోచనలు వికసిత్ భారత్ సంకల్పానికి కొత్త శక్తిని అందిస్తాయని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని శ్రీ మోదీ పొందుపరుస్తూ:
‘‘రాజమాత విజయరాజే సింధియా గారికి ఆమె జయంతి సందర్భంగా వందన శతాలు. దేశానికి సేవ చేయడంలో ఆమె త్యాగం, అంకితభావం అందరికీ స్ఫూర్తిదాయకం. ఆమె ఆదర్శాలు, ఆమె ఆలోచనలు వికసిత్ భారత్ సంకల్పానికి కొత్త శక్తిని అందిస్తున్నాయి’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 2322206)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam