కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా ఇండియా పోస్ట్ పార్శిల్ సేవల కోసం
తపాలా శాఖ - బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ మధ్య కుదిరిన ఒప్పందం
నాడు పోస్టు చేయడమైనది:
09 OCT 2026 7:07PM by PIB Hyderabad
భారత పార్శిల్, సరుకు రవాణా వ్యవస్థ బలోపేతం దిశగా కీలక ముందడుగు పడింది. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని తపాలా శాఖ - బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ సంస్థల మధ్య ఇండియా పోస్ట్ పార్శిల్ సేవల కోసం ఒప్పందం కుదిరింది.
న్యూఢిల్లీ వేదికగా ఈ రోజు రెండు సంస్థలకు చెందిన ఉన్నతాధికారుల సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.
దేశవ్యాప్తంగా సమర్థమైన, నమ్మకమైన, వినియోగదారుల-కేంద్రితమైన పార్శిల్ డెలివరీ పరిష్కారాలను అందించడం కోసం తపాలా శాఖ అసమాన విస్తృతి, విశ్వసనీయ డెలివరీ నెట్‌వర్క్‌తో పాటు భారత సరుకు రవాణా రంగంలో బ్లూ డార్ట్ బలమైన ఉనికిని ఉపయోగించుకోవడం ఈ భాగస్వామ్యం లక్ష్యం.
ఒప్పందంలోని ముఖ్యాంశాలు
దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలనూ చేరుకోవడం: మారుమూల ప్రాంతాలు, తక్కువ సేవలు అందుతున్న ప్రాంతాలు సహా పట్టణ, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల వ్యాప్తంగా పార్శిల్ డెలివరీ సేవల కోసం ఇండియా పోస్ట్ విస్తృత నెట్‌వర్క్‌ను బ్లూ డార్ట్ ఉపయోగించుకుంటుంది.
సమగ్ర డెలివరీ పరిష్కారాలు: ప్రీపెయిడ్, క్యాష్ ఆన్ డెలివరీ (సీవోడీ) పార్శిళ్ల డెలివరీ, ఓటీపీ ఆధారిత డెలివరీ ధ్రువీకరణ, రియల్-టైమ్ షిప్‌మెంట్ ట్రాకింగ్ వంటివి ఈ సేవల్లో భాగంగా ఉంటాయి.
వినియోగదారులకు మెరుగైన అనుభవం: వేగవంతమైన డెలివరీలు, మెరుగైన కార్యాచరణ సమన్వయం, సమర్థమైన పార్శిల్ రవాణా, డెలివరీ కోసం సజావైన సాంకేతిక ఏకీకరణపై ఈ ఒప్పందం దృష్టి సారిస్తుంది.
ఇ-కామర్స్ వృద్ధికి మద్దతు: దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఇ-కామర్స్ రంగానికి మద్దతునిచ్చే లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను ఈ సహకారం మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్‌కు ప్రయోజనాలు
దేశవ్యాప్తంగా విస్తరించిన 1.64 లక్షల తపాలా కార్యాలయాల నెట్‌వర్క్‌ను బ్లూ డార్ట్ వినియోగించుకోనుంది. ఈ భాగస్వామ్యం ద్వారా బ్లూ డార్ట్ తన లాజిస్టిక్స్ కార్యకలాపాలను విస్తరించుకోవడానికి, డెలివరీ వేగాన్ని మెరుగుపరచుకోవడానికి, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో పెరుగుతున్న భారత ఇ-కామర్స్ రంగ డిమాండ్లను తీర్చడానికి వీలు కలుగుతుంది.
తపాలా శాఖకు కలిగే ప్రయోజనాలు
అదనపు వ్యాపార పరిమాణాల కోసం దాని తపాలా, పార్శిల్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవడానికి, వ్యవస్థీకృత లాజిస్టిక్స్ రంగంతో దాని సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ఈ భాగస్వామ్యం తపాలా శాఖకు అవకాశాన్ని అందిస్తుంది. ఈ సహకారం ద్వారా... ఒక ప్రముఖ ఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్ కార్యాచరణ అనుభవం, పరిశ్రమ పద్ధతుల నుంచి ప్రయోజనం పొందేందుకూ ఆ శాఖకు వీలు కలుగుతుంది.
తపాలా శాఖ గురించి
కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని 'తపాలా శాఖ'... దేశవ్యాప్తంగా గల 1.64 లక్షలకు పైగా తపాలా కార్యాలయాలతో ప్రపంచంలోనే అతిపెద్ద తపాలా నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది. దేశంలో ఇ-కామర్స్ వృద్ధిని ప్రోత్సహించడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. సమాచార మార్పిడి, లాజిస్టిక్స్, ఆర్థిక సేవలను అందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది.
బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ గురించి
బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా డెలివరీ, లాజిస్టిక్స్ పరిష్కారాలను అందించే ఒక ఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్స్, పంపిణీ సంస్థ. ఈ సంస్థకు విస్తృతమైన దేశీయ నెట్‌వర్క్ ఉంది. ఇ-కామర్స్, నిర్ణీత సమయానికి అత్యంత వేగంగా చేరవేయాల్సిన ఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్స్ సహా వివిధ రంగాల వ్యాపారాలకు సేవలు అందించడంలో ఇది అనుభవం కలిగి ఉంది.
***
(రిలీజ్ ఐడి: 2321634)
సందర్శకుల సూచీ సంఖ్య : : 20