ఆర్థిక మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలోని హెచ్‌ఐఎల్ (ఇండియా)కి సంబంధించిన 5.119 ఎకరాల భూముల అమ్మకానికి టెండర్లను ఆహ్వానించిన ఎన్ఎల్ఎంసీ
నజఫ్‌గఢ్ పారిశ్రామిక ప్రాంతంలోని భూమికి రూ.829.69 కోట్ల రిజర్వ్ ధర నిర్ణయం… రిజిస్ట్రేషన్ ప్రక్రియ, టెక్నికల్ బిడ్ దాఖలుకు నవంబర్ 19, 2026 చివరి తేదీ
నాడు పోస్టు చేయడమైనది:
09 OCT 2026 2:13PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని నజఫ్‌గఢ్ పారిశ్రామిక ప్రాంతంలోని రోహతక్ రోడ్డు, శివాజీ మార్గ్‌లో ఉన్న హెచ్‌ఐఎల్ (ఇండియా) లిమిటెడ్‌కు సంబంధించిన ల్యాండ్ మానిటైజేషన్ కోసం ఈ-వేలంతో పాటు ఈ-టెండర్‌లో పాల్గొనవలసిందిగా అర్హులైన బిడ్డర్లను ఆర్థిక మంత్రిత్వ శాఖ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ (డీపీఈ) పరిధిలోని నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్ఎల్ఎంసీ) ఆహ్వానించింది. ప్రభుత్వ భూముల మానిటైజేషన్ ప్రణాళికలకు ఊతమిస్తూ, గత రెండు నెలల్లో ఎన్ఎల్ఎంసీ బహిరంగంగా ప్రకటించిన మూడో ఈ-వేలం ఇది.
సుమారు 5.119 ఎకరాల భూమిని పారదర్శకంగా, పోటీతత్వంతో ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా నేరుగా విక్రయించేందుకు ప్రతిపాదించారు. హెచ్‌ఐఎల్ (ఇండియా) లిమిటెడ్ తరఫున ఎన్ఎల్ఎంసీ ఈ ఆస్తుల మానిటైజేషన్ ప్రక్రియను నిర్వహిస్తోంది.
ఈ ఆస్తి న్యూఢిల్లీలోని శివాజీ మార్గ్, రోహతక్ రోడ్డు వెంబడి ఉన్న నజఫ్‌గఢ్ పారిశ్రామిక ప్రాంతంలో ఉంది. అర్హులైన బిడ్డర్లు క్రమబద్ధమైన, పారదర్శకమైన ఆస్తుల మానిటైజేషన్ ప్రక్రియలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తూ, ఈ-టెండర్‌ను అనుసరిస్తూ, ఈ-వేలం ద్వారా విక్రయానికి పెట్టారు.
భూమికి రూ.829.69 కోట్లను రిజర్వ్ ధరగా నిర్ణయించారు. బిడ్ మొత్తాన్ని పెంచాలనుకుంటే ఎకరానికి కనీసం కోటి రూపాయల చొప్పున పెంచాలి. ఈ ప్రక్రియలో అర్హులైన బిడ్డర్లు పాల్గొనేందుకు రూ.16.60 కోట్ల ఈఎండీని సమర్పించాల్సి ఉంటుంది.
ఈ-టెండర్, ఈ-వేలం ప్రక్రియ
మానిటైజేషన్ ప్రక్రియ ఈ-టెండర్, ఈ-వేలం ద్వారా రెండు దశల్లో ఎలక్ట్రానిక్ విధానంలో జరుగుతుంది. ఆసక్తి గల, అర్హులైన బిడ్డర్లు నిర్ణీత గడువులోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. అవసరమైన టెక్నికల్ బిడ్‌ను సమర్పించాలి. నిర్దేశిత ఈఎండీని డిపాజిట్ చేయాలి.
రిజిస్ట్రేషన్, టెక్నికల్ బిడ్, ఈఎండీ, బ్యాంక్ గ్యారెంటీని సమర్పించేందుకు చివరి తేదీ... నవంబర్ 19, 2026న మధ్యాహ్నం 2: 00 గంటలు. టెక్నికల్ బిడ్లను నవంబర్ 20, 2026న సాయంత్రం 4:00 గంటలకు ఓపెన్ చేస్తారు. మాక్ వేలాన్ని నవంబర్ 23, 2026న నిర్వహిస్తారు. టెక్నికల్ బిడ్లు తెరిచిన తర్వాత ఈ-వేలం తేదీని ప్రకటిస్తారు.
వేలంలో పాల్గొనే బిడ్డర్లకు సహాయం చేసేందుకు, బిడ్డింగ్ ప్రక్రియను స్పష్టంగా తెలియజేసేందుకు నవంబర్ 3, 2026న సాయంత్రం 4:00 గంటలకు న్యూఢిల్లీలోని లోధీ రోడ్డు, సీజీఓ కాంప్లెక్స్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ భవన్, బ్లాక్-14, రూమ్ నం. 309లో ప్రీ-బిడ్ సమావేశాన్ని నిర్వహిస్తారు.
ఈ-వేలం ప్రకటనలో తెలిపినట్లుగా "ఉన్నది ఉన్నట్లుగా", "ఎలా ఉంటే అలా", "అక్కడ ఏది ఉంటే అది", "ఎటువంటి రద్దు, ఫిర్యాదుకు తావులేని" ప్రాతిపదికన విక్రయం జరుగుతుంది.
అక్టోబర్ 8, 2026న విడుదల చేసిన ఈ-వేలం నోటిఫికేషన్ నెం. ఎన్ఎల్ఎంసీ, లీగల్, ఆక్షన్, ఆర్ఎఫ్‌పీ-2026 ద్వారా వేలం ప్రకటనను జారీ చేశారు.
ఎన్ఎల్ఎంసీ గురించి
భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన ప్రభుత్వ సంస్థల విభాగం పరిధిలో నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్ఎల్ఎంసీ) పనిచేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు చెందిన మిగులు భూమి, వినియోగంలో లేని ఆస్తుల మానిటైజేషన్‌ను సులభతరం చేస్తుంది.
నిర్మాణాత్మకమైన, పారదర్శకమైన మానిటైజేషన్ ప్రక్రియ ద్వారా వినియోగంలో లేని మిగులు ఆస్తుల విలువను వెలికితీయటంలో ఎన్ఎల్ఎంసీ సహాయపడుతుంది. తద్వారా అలాంటి ఆస్తుల ఆర్థిక సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకొనే వీలును సంబంధిత సంస్థలకు అందిస్తుంది.
ఆర్ఎఫ్‌పీ, రిజిస్ట్రేషన్, వేలం వివరాలు, ఈ కార్యక్రమంలో పాల్గొనే విధానం కోసం: nlmc.enivida.com
ఎన్ఎల్ఎంసీ సమాచారం కోసం: nlmc.dpe.gov.in
***
(రిలీజ్ ఐడి: 2321476)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2