రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలోని 25 డీజీ సెట్‌లకు రెట్రోఫిట్ ఉద్గార నియంత్రణ పరికరాలను అమర్చనున్న ఎన్‌హెచ్‌ఏఐ

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గాలి నాణ్యత ప్రమాణాల అమలు బలోపేతం, డీజిల్ జనరేటర్ సెట్ల నుంచి వెలువడే ఉద్గారాలను తగ్గించడం లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమం

ఎక్స్‌ప్రెస్‌వే లైటింగ్, ఇతర సంబంధిత కార్యకలాపాల కోసం ఉపయోగించే డీజీ సెట్లకు ఆర్ఈసీడీలను అమర్చడం ద్వారా ఉద్గార నియంత్రణ చర్యల బలోపేతం

నాడు పోస్టు చేయడమైనది: 09 OCT 2026 4:46PM by PIB Hyderabad

జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్) పరిధిలోని జాతీయ రహదారి కారిడార్‌లో పర్యావరణ పరిరక్షణ చర్యల బలోపేతం లక్ష్యంగా... బసాయి నుంచి ఖేర్కి ధౌలా/ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వే క్లోవర్‌లీఫ్ కూడలిని కలిపే ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలోని 8.7 కిలోమీటర్ల పొడవైన ప్యాకేజ్-IVలో ఏర్పాటు చేసిన 25 డీజిల్ జనరేటర్ (డీజీ) సెట్లకు రెట్రోఫిట్ ఉద్గార నియంత్రణ పరికరాలు (ఆర్‌ఈసీడీలు)ను అమర్చే కార్యక్రమాన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) చేపట్టింది.

 

ముఖ్యంగా శీతాకాలంలో వాయు కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో... ఎన్‌సీఆర్ ప్రాంతంలో డీజిల్ జనరేటర్ (డీజీ) సెట్ల నియంత్రణకు సంబంధించి కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఏక్యూఎమ్) ఆదేశాలకు అనుగుణంగా, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) కింద ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ప్యాకేజ్ IV ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ శీతాకాలంలో తీవ్రమైన వాయు కాలుష్యం ఉంటుంది. ఈ కీలక సమయంలో పరిసరాల గాలి నాణ్యతను మెరుగుపరచడానికి, ఈ ప్రాంతంలో పనిచేస్తున్న డీజీ సెట్ల కోసం నియంత్రణ, ఉద్గార నియంత్రణ చర్యలను సీఏక్యూఎమ్ తప్పనిసరి చేసింది.

 

ఎక్స్‌ప్రెస్‌వే లైటింగ్, ఇతర సంబంధిత కార్యకలాపాల కోసం ఉపయోగించే డీజీ సెట్లకు ఆర్ఈసీడీలను అమర్చుతారు. తద్వారా వాటి నిర్వహణ సమయంలో ఉద్గార నియంత్రణ చర్యలు బలోపేతం అవుతాయి. ఈ అమలు ప్రక్రియలో భాగంగా ఆర్ఈసీడీలను ఏర్పాటు చేయడం, పరీక్షించడం, వినియోగంలోకి తీసుకురావడంతో పాటు వాటి సమగ్ర నిర్వహణకూ మద్దతు లభిస్తుంది.

జాతీయ రహదారుల నిర్మాణం, నిర్వహణలో సమగ్ర పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఎన్‌హెచ్‌ఏఐ అనుసరిస్తున్న విస్తృత విధాన ప్రణాళికలో ఆర్‌ఈసీడీ కీలక భాగంగా ఉంది. ముఖ్యంగా ఎన్‌సీఆర్‌ పరిధిలోని ప్రాజెక్టుల్లో దీనిని అమలు చేస్తున్నారు. జాతీయ రహదారులకు సంబంధించిన కీలక కార్యకలాపాలకు అవసరమైన డీజీ సెట్‌లు... వర్తించే నియంత్రణ విధానాలకు అనుగుణంగా సరైన ఉద్గార-నియంత్రణ వ్యవస్థలను కలిగి ఉండేలా చూడటంలో ఈ కార్యక్రమం ఎంతగానో సహాయపడుతుంది. నిబంధనల అమలు, పారదర్శకతను తనిఖీ చేయడం కోసం.. ప్రతి డీజిల్ జనరేటర్ వద్ద అమర్చిన ఆర్ఈసీడీ పరికరాలకు సంబంధించి జీపీఎస్ ట్యాగ్‌తో కూడిన ఫోటోలను రికార్డులుగా భద్రపరచాలనీ ఎన్‌హెచ్ఏఐ స్పష్టం చేసింది.

 

ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలోని జాతీయ రహదారుల ప్రాజెక్టుల్లో ఎన్‌హెచ్ఏఐ చేపడుతున్న పర్యావరణ పరిరక్షణ చర్యలు... వాయు నాణ్యతా ప్రమాణాల కఠిన నిబంధనలకు అనుగుణంగా రహదారి మౌలిక సదుపాయాల విస్తరణ, నిర్వహణను సమన్వయం చేయాలనే విస్తృత లక్ష్యంతో ముడిపడి ఉన్నాయి.

***


(రిలీజ్ ఐడి: 2321465) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Malayalam