సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
వ్యక్తిగత బహుమతుల నుంచి ప్రజా ప్రయోజనాల వరకు:
ప్రధానికి ఏపీ అందించిన జ్ఞాపికలతో జాతీయ ప్రయోజనం
కొండపల్లి చెక్కబొమ్మలు, కలంకారీ కళ, జ్ఞాపికలు సహా ఆంధ్రప్రదేశ్ నుంచి 18 బహుమానాలు
నాడు పోస్టు చేయడమైనది:
09 OCT 2026 2:22PM by PIB Hyderabad
ప్రధానమంత్రికి బహూకరించిన జ్ఞాపికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి అందిన 18 జ్ఞాపికలు.. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్నీ, సంప్రదాయ హస్తకళలనూ, ప్రజా విజయాలను ప్రతిబింబించేవిగా ఉన్నాయి. ప్రధానమంత్రికి వ్యక్తిగత కానుకలుగా అందించిన ఈ కళాకృతులు.. నేడు ఒక బృహత్తరమైన జాతీయ లక్ష్యానికి దోహదపడే బహిరంగ వేలంలో భాగమయ్యాయి.
గ్రామీణ జీవనాన్నీ, సంప్రదాయ హస్తకళలను ప్రతిబింబించే కొండపల్లి చెక్క ఎద్దుల బండి, ప్రధానమంత్రి చిత్రంతో కూడిన కలంకారీ వస్త్రం, శ్రీశైలంలోని శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రం జ్ఞాపికలు ప్రధానమంత్రికి బహూకరించిన కళాకృతుల్లో ఉన్నాయి. రాష్ట్ర జానపద కళలు, వస్త్ర సంప్రదాయాలు, సాంస్కృతిక చరిత్రలను ఇవి ప్రతిబింబిస్తున్నాయి.
image.jpeg
image.jpeg
image.jpeg
image.jpeg
సంప్రదాయ కళలు, ఆధ్యాత్మిక హస్తకళలతోపాటు.. ప్రస్తుత సామాజిక ప్రాధాన్యాలను, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే జ్ఞాపికలు కూడా వీటిలో ఉన్నాయి. స్త్రీ శక్తి ప్రతిభా పురస్కారం-2025 జ్ఞాపిక మహిళా సాధికారతను, విజయాలకు గుర్తింపుగా నిలవగా... సంక్షేమ పథకాలు, వ్యవసాయం, వైద్యం, విద్య, మౌలిక సదుపాయాల వంటి వివిధ అంశాలను వివరించేలా రూపుదిద్దిన గుడ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియా అక్రిలిక్ పెయింటింగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అందించిన ఈ జ్ఞాపికలు.. రాష్ట్ర సాంస్కృతిక అస్తిత్వాన్నే కాకుండా, సామాజిక పురోగతి, అభివృద్ధి పట్ల ఆకాంక్షలను ప్రతిబింబించేవిగా ఉన్నాయి.
‘పీఎం మెమెంటోస్’ కార్యక్రమం.. ఈ జ్ఞాపికల పరిధిని బహుమానాల స్థాయిని మించి విస్తరించింది. బహిరంగ వేలం ద్వారా ఈ జ్ఞాపికలను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు. దీని ద్వారా వచ్చే నిధులను ‘నమామి గంగే’ కార్యక్రమానికి కేటాయిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన జ్ఞాపికల వైశిష్ట్యం దేశవ్యాప్తమవడమే కాకుండా.. గంగా నది పరిరక్షణ, పునరుజ్జీవన జాతీయ బృహత్కార్యంలోనూ ఈ కార్యక్రమం ద్వారా అవి భాగమవుతున్నాయి.
ప్రధానమంత్రి జ్ఞాపికల ఇ-వేలం ప్రస్తుతం కొనసాగుతోంది. 2026 అక్టోబరు 31 వరకు దీని గడువును పొడిగించారు. ఆసక్తి గల వేలందార్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 18 జ్ఞాపికలను పరిశీలించి, అధికారిక పీఎం మెమెంటోస్ వెబ్‌సైట్ https://pmmementos.gov.inలో బిడ్ దాఖలు చేయవచ్చు.
***
(రిలీజ్ ఐడి: 2321451)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2