ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రభుత్వాధినేతగా దేశ సేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన కజకిస్థాన్ దేశాధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

నాడు పోస్టు చేయడమైనది: 08 OCT 2026 7:11PM by PIB Hyderabad

తనకు ఆప్యాయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన కజకిస్థాన్ దేశాధ్యక్షుడు శ్రీ కాసిమ్-జోమార్ట్ టోకాయెవ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వాధినేతగా దేశసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానికి ఆయన ఈ అభినందనలు తెలిపారు.

 

కజకిస్థాన్‌తో ఉన్న ఘనమైన స్నేహసంబంధాలను, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, మరింత దృఢంగా చేసేందుకు కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపారు.

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:

 

"అధ్యక్షులు టోకాయెవ్.. మీ ఆప్యాయపూర్వక శుభాకాంక్షలకు ధన్యవాదాలు. కజకిస్థాన్‌తో మనకున్న సాన్నిహిత్యాన్ని, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నేను ఎంతో విలువైనదిగా భావిస్తున్నాను. మన ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి, దృఢంగా చేసేందుకు కలిసి పనిచేయాలని ఎదురుచూస్తున్నాను.”


(రిలీజ్ ఐడి: 2321018) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Gujarati , Kannada