జాతీయ మానవ హక్కుల కమిషన్
azadi ka amrit mahotsav

2026 అక్టోబర్ 3న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసనలో ముగ్గురు జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసు సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న వార్తను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల సంఘం

రెండు వారాల్లోగా పూర్తి వివరాలతో కూడిన నివేదికను అందించాలని ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు నోటీసులు జారీ

నాడు పోస్టు చేయడమైనది: 08 OCT 2026 3:53PM by PIB Hyderabad

2026 అక్టోబర్ 3న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసనలో ముగ్గురు మహిళా జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసు సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న మీడియా కథనాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్ఆర్‌సీ) సుమోటోగా స్వీకరించింది. 

 

మీడియాలో వచ్చిన వార్తలోని విషయాలను కమిషన్ గమనించింది. అవే నిజమైతే.. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన తీవ్రమైన అంశంగా పరిగణిస్తుంది. ఈ విషయంపై రెండు వారాల్లోగా పూర్తి వివరాలతో కూడిన నివేదికను ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు నోటీసు జారీ చేసింది.

 

2026 అక్టోబర్ 5న ప్రచురితమైన వార్త ప్రకారం.. ఈ ఘటనపై న్యూఢిల్లీ జిల్లా పోలీసులకు ఫిర్యాదులు అందాయి. వాటిని విచారణ నిమిత్తం ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు.

 

***


(రిలీజ్ ఐడి: 2320971) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Malayalam