ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ నానా పాటేకర్ గారు కన్నుమూత… సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
08 OCT 2026 12:23PM by PIB Hyderabad
దిగ్గజ నటుడు శ్రీ నానా పాటేకర్ గారి మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు. నానా పటేకర్ మాదిరిగా తీవ్రత, విశిష్టత, ఓ పట్టాన మరచిపోలేని ప్రభావాన్ని కలిగించే నటులు చాలా తక్కువ మంది ఉంటారని ప్రధానమంత్రి కొనియాడారు. ప్రతి పాత్రకూ అసాధారణ రీతిలో బహుముఖ వైవిధ్యాన్నీ, సృజనాత్మకతనీ జోడించి ప్రేక్షకుల కళ్లకు కట్టిన అంశాలు తరాల తరబడి గుర్తుంటాయని ప్రధాని అన్నారు. నమ్మిన దానిని వెల్లడించడానికి ఆయన ఎన్నడూ వెనుకాడేవారు కాదనీ, అభిప్రాయాలను స్పష్టంగానూ, నిర్మొహమాటంగా తెలియజేసినందుకు కూడా శ్రీ పాటేకర్ అనేక ప్రశంసలకు నోచుకున్నారని శ్రీ మోదీ అన్నారు.
హిందీ, మరాఠీ చలనచిత్ర రంగాలకు శ్రీ పాటేకర్ ఎనలేని సేవ చేశారని ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, ఆయన మరణం భారీ లోటును మిగిల్చిందన్నారు. శ్రీ పాటేకర్ కుటుంబ సభ్యులకూ, స్నేహితులకూ, అసంఖ్యాక అభిమానులకూ ప్రధానమంత్రి సంతాపం తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘శ్రీ నానా పాటేకర్ గారిలో ఉన్న తీవ్రత, విశిష్టత, ఓ పట్టాన మరచిపోలేని ప్రభావాన్ని కలిగించే నటులు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రతి పాత్రకూ అసాధారణ రీతిలో బహుముఖ వైవిధ్యాన్నీ, సృజనాత్మకతనీ జోడించి ప్రేక్షకుల కళ్లకు కట్టిన సందర్భాలు తరాల తరబడీ గుర్తుంటాయి. నమ్మిన దానిని వెల్లడించడానికి ఆయన ఎన్నడూ సంకోచించే వారు కాదు. స్పష్టంగా నిర్మొహమాటంగా అభిప్రాయాలను తెలియజేసినందుకు కూడా శ్రీ పాటేకర్ అనేక ప్రశంసలకు నోచుకున్నారు.
హిందీ, మరాఠీ చలనచిత్ర రంగాలకు శ్రీ పాటేకర్ ఎనలేని సేవ చేశారు. ఆయన మరణం ఒక భారీ లోటును మిగిల్చింది. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులతో పాటు అసంఖ్యాక అభిమానులకు నేను సంతాపం తెలియజేస్తున్నాను. ఓమ్ శాంతి’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2320709)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2