రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

నౌకా దళానికి చెందిన మొదటి సేవా నౌక ప్రారంభం, అయిదో నౌక నిర్మాణం ప్రారంభం

నాడు పోస్టు చేయడమైనది: 07 OCT 2026 1:15PM by PIB Hyderabad

విశాఖపట్నంలోని హిందూస్థాన్ షిప్‌యార్డ్ లో తొలి సహాయక నౌక- ఎఫ్ఎస్ఎస్-1 అక్టోబర్ 06, 2026న విజయవంతంగా జలప్రవేశం చేసింది. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన సమక్షంలో నౌకాదళ సంప్రదాయాలకు అనుగుణంగా నౌకాదళ సంక్షేమం, శ్రేయో సంఘం(ఎన్‌డబ్ల్యూడబ్ల్యూఏ) అధ్యక్షురాలు శ్రీమతి లైలా స్వామినాథన్ ఈ నౌకను ప్రారంభించారు.

ఈ సందర్భంగా అయిదో సహాయక నౌక- ఎఫ్ఎస్ఎస్-5 నిర్మాణ పనులకు శంకుస్థాపన (కీల్ లేయింగ్) చేయడంతోపాటు హెచ్ఎస్ఎల్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసిన ‘ఆగ్మెంటెడ్ స్లిప్‌వే’ను కేంద్రమంత్రి శ్రీ శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్‌తో పాటు భారత నౌకాదళం, రక్షణ మంత్రిత్వశాఖ, హిందుస్థాన్ షిప్‌యార్డ్ కు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ నౌకాదళ సహాయక నౌకలను స్వదేశీ పరిజ్ఞానంతో (82 శాతం) విశాఖపట్నంలోని హెచ్‌ఎస్ఎల్ రూపొందించి, నిర్మించింది. ఇది నౌకాదళం, షిప్‌యార్డ్, రక్షణ రంగ పరిశ్రమలు, సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల మధ్య ఉన్నత స్థాయి పరస్పర సహకారానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ ఓడలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టిన తర్వాత సముద్రంలో ఉన్న ఇతర నౌకలకు అవసరమైన సామగ్రి, ఇంధనం, నిత్యావసరాలు, రవాణా సదుపాయాలను అందించడం ద్వారా యుద్ధ నౌకలు పదే పదే తీరానికి చేరాల్సిన అవసరం ఉండదు.

ఈ నౌకలు నౌకాదళ కార్యకలాపాల అవసరాలను తీర్చడంతోపాటు.. వ్యూహాత్మక పరిధినీ, నౌకల ప్రయాణాన్నీ మరింత మెరుగుపరుస్తాయి. అత్యవసర సమయాల్లో మానవతా సాయం అందించడం నుంచి విపత్తు సహాయక చర్యల (హెచ్‌ఏడీఆర్) వరకూ, పౌరులను తరలించడం వంటి సహాయక చర్యల్లో ఈ నౌకలు సహాయకారులుగా ఉంటాయి.

ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు భారత నౌకా నిర్మాణ పరిశ్రమకు గణనీయమైన ప్రోత్సాహాన్ని అందించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాలకు గర్వకారణంగా నిలుస్తోంది.

***


(రిలీజ్ ఐడి: 2320147) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Gujarati , Tamil