ప్రధాన మంత్రి కార్యాలయం
అంకితభావంతో సేవలందించే గుణం ప్రధానమంటున్న సంస్కృత సుభాషితం.. ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
07 OCT 2026 10:53AM by PIB Hyderabad
అంకితభావంతో సేవ చేయడం, ధర్మానికి బద్ధులై నడుచుకోవడంతో పాటు కర్తవ్యం పట్ల నిష్ఠను కలిగి ఉండడం కూడా ముఖ్యమని ప్రస్తావిస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
‘‘నిత్యం పరిచరేచ్చైవ తద్వై సుకృతముత్తమమ్
కీర్తిం పుణ్యం యశో లోకాన్ ప్రాప్స్యసే రాజసత్తమ్’’ అనే సుభాషితాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు.
ఇతరులకు సేవ చేయడం, బాధ్యతలను పూర్తి నిష్ఠతో నిర్వర్తించడం.. వీటిని సత్ప్రవర్తనతో ముడిపడిన అత్యున్నత విధానాలుగా చెప్పవచ్చని పైన ప్రస్తావించిన సుభాషితం సూచిస్తోంది. అలాంటి నిష్ఠ కేవలం సద్గుణాన్నీ, సద్భావననే ప్రసాదించదనీ, అంతకు మించి.. సమాజంలో చిరస్థాయి గౌరవంతో పాటు గుర్తింపు కూడా లభించేటట్లు చేస్తుందనీ ఈ సుభాషితం బోధిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘నిత్యం పరిచరేచ్చైవ తద్వై సుకృతముత్తమమ్
కీర్తిం పుణ్యం యశో లోకాన్ ప్రాప్స్యసే రాజసత్తమ్’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2320083)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam