ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇంధన రూపాంతరీకరణ.. విస్తృతి.. లభ్యత.. భద్రతలకు ప్రాధాన్యంగల వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 07 OCT 2026 12:43PM by PIB Hyderabad

   దేశంలో తన నాయకత్వాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఇంధన రూపాంతరీకరణ  ప్రస్థానాన్ని వివరించే ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రజలతో పంచుకున్నారు. విస్తృతి.. లభ్యత.. శరవేగంగా పునరుత్పాదకత వృద్ధి, అధిక ఇంధన భద్రత దీనికి ప్రాతిపదికగా ఉన్నాయి.

అలాగే, ప్రపంచ ఇంధన వాణిజ్యంలో విద్యుత్తుతో పాటు కాలుష్య రహితంగా వంట నుంచి సౌర, అణుశక్తి, జీవ ఇంధనాల దాకా భారత్‌ నేడు కీలక పాత్ర పోషిస్తోంది. తద్వారా మరింత వైవిధ్యభరిత, పటిష్ట ఇంధన వ్యవస్థకు స్థిరమైన రూపమివ్వడాన్ని ఈ వ్యాసం వివరిస్తుంది.

దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వాన భారత ఇంధన రూపాంతరీకరణ ప్రస్థానం విస్తృతి.. లభ్యత.. పునరుత్పాదక వృద్ధి శరవేగ పురోగమనం, అధిక ఇంధన భద్రతతో సాగుతోంది. ఆ మేరకు విద్యుత్తు, కాలుష్య రహిత వంట నుంచి సౌర, అణుశక్తి, జీవ ఇంధనాల దాకా దేశం క్రమంగా మరింత వైవిధ్యభరిత, పటిష్ట ఇంధన వ్యవస్థను రూపొందిస్తోంది. ఈ విధంగా ప్రపంచ ఇంధన వాణిజ్యం-సాంకేతికతలో భారత్‌ పాత్ర ప్రస్ఫుటమవుతోంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించినట్లు పేర్కొంది.

 

***


(రిలీజ్ ఐడి: 2320073) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Gujarati , Kannada , Malayalam