ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా క్రీడల-పురుషుల 57 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో చరిత్రాత్మక స్వర్ణ పతకం సాధించిన అమన్ సెహ్రావత్‌కు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 03 OCT 2026 7:30PM by PIB Hyderabad

ఆసియా క్రీడల-పురుషుల 57 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించిన అమన్ సెహ్రావత్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

 

గత ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించడం నుంచి ఈసారి విజేతగా నిలవడం దాకా, అమన్ సెహ్రావత్ అద్భుతమైన పట్టుదలను ప్రదర్శించారని శ్రీ మోదీ పేర్కొన్నారు.

 

‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:

 

“అమన్ సెహ్రావత్ సాధించిన అద్భుత విజయం!

 

ఆసియా క్రీడల-పురుషుల 57 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించడం ద్వారా అమన్ చరిత్ర సృష్టించారు. గత ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించడం నుంచి ఈసారి విజేతగా నిలవడం దాకా, అమన్ అద్భుతమైన పట్టుదలను ప్రదర్శించారు. అమన్ సెహ్రావత్‌కు అభినందనలు. వారి భవిష్యత్ ప్రయత్నాల కోసం శుభాకాంక్షలు”


(రిలీజ్ ఐడి: 2318760) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Gujarati , Malayalam