ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా క్రీడల్లో మహిళల వ్యక్తిగత గోల్ఫ్‌లో చారిత్రాత్మక స్వర్ణ పతకం సాధించిన ప్రణవి శరత్‌ ఉర్స్‌కు ప్రధానమంత్రి అభినందన

నాడు పోస్టు చేయడమైనది: 03 OCT 2026 5:37PM by PIB Hyderabad

ఆసియా క్రీడల్లో మహిళల వ్యక్తిగత గోల్ఫ్‌లో భారత్‌కు తొలిసారిగా స్వర్ణ పతకం సాధించిన ప్రణవి శరత్‌ ఉర్స్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

 

ప్రణవి అద్భుత విజయంతో దేశానికి చిరస్మరణీయమైన క్రీడా ఘట్టాన్ని అందించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ విజయం మరింతమంది యువ భారతీయులను గోల్ఫ్‌ క్రీడ వైపు ఆకర్షించడంతో పాటు, అత్యున్నత స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగేందుకు వారిని ప్రేరేపిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

ప్రణవి శరత్‌ ఉర్స్‌కు శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

 

“చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విజయం! ఆసియా క్రీడల్లో మహిళల వ్యక్తిగత గోల్ఫ్‌లో భారత్‌కు తొలిసారిగా స్వర్ణ పతకం సాధించిన ప్రణవి శరత్‌ ఉర్స్‌కు అభినందనలు. ఆమె అద్భుత ముగింపు దేశానికి చిరస్మరణీయమైన క్రీడా ఘట్టాన్ని అందించింది. ఈ విజయం మరింతమంది యువ భారతీయులను గోల్ఫ్‌ క్రీడ వైపు ఆకర్షించడంతో పాటు, అత్యున్నత స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగేందుకు వారిని ప్రేరేపించాలని ఆకాంక్షిస్తున్నాను. అద్భుతంగా ఆడారు. ప్రణవి శరత్‌ ఉర్స్‌కు శుభాకాంక్షలు” అని ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొంది.


(రిలీజ్ ఐడి: 2318715) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Gujarati , Tamil , Malayalam