ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత తొలి 5.56 కిలోమీటర్ల ఫ్రీ - స్పేస్ క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్ లింక్ ప్రదర్శన

నాడు పోస్టు చేయడమైనది: 03 OCT 2026 4:44PM by PIB Hyderabad

భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో - ఇన్ఫర్మాటిక్స్ (బీఐఎస్ఏజీ-ఎన్), ఐఐటీ గాంధీనగర్‌ల సహకారంతో క్యూఎన్యూ ల్యాబ్స్ 5.56 కిలోమీటర్ల దూరంతో భారత మొట్టమొదటి ఫ్రీ - స్పేస్ క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్ (క్యూకేడీ) లింక్‌ను విజయవంతంగా ప్రదర్శించింది.

 

సెప్టెంబర్ 27 - 28 రాత్రి నిర్వహించిన ఈ క్షేత్రస్థాయి ప్రయోగం ద్వారా బీఐఎస్ఏజీ-ఎన్, ఐఐటీ గాంధీనగర్‌ల మధ్య సురక్షితమైన క్వాంటం కమ్యూనికేషన్ నెట్‌వర్క్ విజయవంతంగా ఏర్పాటు అయింది. క్యూఎన్యూ ల్యాబ్స్ పాయింటింగ్, అక్విజిషన్, ట్రాకింగ్ సిస్టమ్ ఆధారంగా నిర్వహించిన ఈ ప్రయోగంలో 5 శాతంలోపు స్థిరమైన క్వాంటమ్‌ బిట్‌ ఎర్రర్‌ రేట్‌ ను సాధించారు. సెకనుకు 230–260 బిట్ల (బీపీఎస్) వేగంతో సురక్షిత కీలు రూపొందించారు. ఈ క్వాంటమ్‌ కీలను పోస్ట్‌ - క్వాంటమ్‌ క్రిప్టోగ్రఫీ సాంకేతికతతో కూడిన బీఐఎస్ఏజీ-ఎన్ కు చెందిన ‘వేదిక్‌ కవచ్‌’ ప్లాట్‌ఫామ్‌లో అనుసంధానించారు. దీంతో పరీక్షా సందేశాలను ఎండ్‌ - టు - ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌, డీక్రిప్షన్‌ ప్రక్రియల ద్వారా విజయవంతంగా భద్రపరచి, తిరిగి డీకోడ్‌ చేయగలిగారు.

 

ఈ ప్రదర్శన క్వాంటం భద్రతలోని రెండు పరస్పర పూరక శ్రేణులను - ఫ్రీ-స్పేస్ ఆప్టికల్ ఛానెళ్లపై ఆధారపడిన క్యూఎన్యూ ల్యాబ్స్ హార్డ్‌వేర్ ఆధారిత 'ఆర్మోస్' క్యూకేడీ పరికరం, క్వాంటం రాండమ్ నంబర్ జనరేషన్‌తో కూడిన బీఐఎస్ఏజీ-ఎన్ 'వేదిక్ కవచ్' సాఫ్ట్‌వేర్ ఆధారిత పోస్ట్ - క్వాంటం క్రిప్టోగ్రఫీ - లను అనుసంధానించింది. ఈ సమగ్రమైన నిర్మాణ శైలి భౌతిక క్వాంటం ఛానెల్ తాత్కాలికంగా లభించని పక్షంలో కూడా భద్రతా వ్యవస్థకు పూర్తి రక్షణను నిరంతరాయంగా అందిస్తుంది.

 

బీఐఎస్ఏజీ - ఎన్ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ వినయ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ, క్యూఎన్యూ ల్యాబ్స్ కు చెందిన క్యూకేడీ సాంకేతికతను వేదిక్‌ కవచ్‌తో అనుసంధానించడం ద్వారా ఆచరణాత్మకమైన క్వాంటమ్‌ - రెసిలియంట్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థల దిశగా కీలక ముందడుగు పడిందని తెలిపారు.

ఈ 5.56 కిలోమీటర్ల ప్రయోగం విజయవంతం కావడం వల్ల మరింత ఎక్కువ దూరాలకు విస్తరించే క్వాంటం - రక్షిత నెట్‌వర్క్‌‌లు, అలాగే శాటిలైట్ ఆధారిత క్వాంటం కమ్యూనికేషన్ వ్యవస్థల ఏర్పాటుకు మార్గం సుగమమైందని క్యూఎన్యూ ల్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సునీల్‌ గుప్తా అన్నారు.

 

ఐఐటీ గాంధీనగర్‌ ఐఎస్టీఎఫ్ ఇన్‌ఛార్జ్, కమాండర్ మనీష్ త్రిపాఠి (రిటైర్డ్) మాట్లాడుతూ, ఈ ప్రదర్శన ఆచరణాత్మక క్వాంటమ్ కమ్యూనికేషన్ సాంకేతికతలను ముందుకు తీసుకెళ్లడానికి విలువైన క్షేత్ర స్థాయి ఫీల్డ్ వాతావరణాన్ని అందిస్తుందని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న సురక్షిత కమ్యూనికేషన్ అవసరాలను తీర్చడానికి విద్యాసంస్థలు, స్వదేశీ సాంకేతికత, వాస్తవ ప్రపంచ ప్రయోగాలు ఎలా అనుసంధాన మవుతాయో కూడా ఇది చూపిస్తుందని ఆయన పేర్కొన్నారు.

 

సురక్షిత కమ్యూనికేషన్‌ మౌలిక వసతుల రంగంలో భారత సామర్థ్యాలను మరింత అభివృద్ధి చేసేందుకు పునాదిని అందించడంతో పాటు, క్వాంటమ్‌ యుగంలో ఉద్భవించే భద్రతా ముప్పులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి కూడా ఈ పరీక్ష దోహదపడుతుంది.

 

బీఐఎస్ఏజీ - ఎన్ గురించి: ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వయంప్రతిపత్తి కలిగిన శాస్త్రీయ సంస్థ బీఐఎస్ఏజీ - ఎన్, అంతరిక్ష సాంకేతిక అనువర్తనాలు, ఉపగ్రహ సమాచార వ్యవస్థలు, జియో - ఇన్ఫర్మాటిక్స్‌ రంగాల్లో పనిచేస్తూ, సాంకేతికత ఆధారిత పాలనకు సహకరిస్తోంది.

 

ఐఐటీ గాంధీనగర్‌ గురించి: 2008లో ఏర్పాటయిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ గాంధీనగర్‌ ఇంజినీరింగ్‌, సైన్స్‌, సాంకేతికత, హ్యుమానిటీస్, సామాజిక శాస్త్రాల్లో అత్యుత్తమ ప్రమాణాలకు పేరుగాంచిన ప్రముఖ విద్యాసంస్థ. ఈ సంస్థ విభిన్న శాస్త్ర పరిశోధనలను, వినూత్న విద్యా విధానాలను, వాస్తవ ప్రపంచ సవాళ్లకు పరిష్కారాలను నిత్యజీవిత సవాళ్లకు సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయడంపై సంస్థ దృష్టి సారిస్తోంది

 

క్యూఎన్యూ ల్యాబ్స్ గురించి: 2016లో ఏర్పాటయిన క్యూఎన్యూ ల్యాబ్స్ క్వాంటమ్‌ సురక్షిత డిజిటల్‌ మౌలిక సదుపాయాల రంగంలో భారత్‌లో ముందంజలో ఉన్న సంస్థ. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ సంస్థకు చెందిన ఉత్పత్తులు, పరిష్కారాలు ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్నాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2318712) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi