సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం: భారతదేశవ్యాప్తంగా వ్యవస్థాపకులకు సాధికారత కల్పన, సమ్మిళిత వృద్ధికి ప్రోత్సాహం
ఉపాధి, సంస్థల వృద్ధిపై పీఎంఈజీపీ పరివర్తనాత్మక ప్రభావాన్ని ప్రతిబింబించే విజయగాథలు
నాడు పోస్టు చేయడమైనది:
02 OCT 2026 7:53PM by PIB Hyderabad
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ (ఎంఎస్ఎంఈ) కీలక పథకమైన పీఎంఈజీపీని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) అమలు చేస్తోంది. ఇది ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కొత్త సూక్ష్మ పరిశ్రమల స్థాపనకు సహకరించటం ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పథకం ద్వారా కావాల్సిన పారిశ్రామికవేత్తలకు బ్యాంకులు మంజూరు చేసిన రుణాలపై పూచీకత్తు మొత్తాన్ని (ఎంఎం) సబ్సిడీ రూపంలో ఆర్థిక సహాయంగా అందుతుంది. ఇది పరిశ్రమల ఏర్పాటుకు ఊతమిస్తుంది.
2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి సుమారు 73.08 లక్షల మందికి స్థిరమైన ఉపాధి అవకాశాలను కల్పనకు పీఎంఈజీపీ ద్వారా సుమారు 8.12 లక్షల మంది సూక్ష్మ పారిశ్రామికవేత్తలకు రూ. 24,398.61 కోట్ల పూచీకత్తు మొత్తం (ఎంఎం) సబ్సిడీ ద్వారా అందింది.
ఆకాంక్షలను పరిశ్రమలుగా నెలకొల్పటం: అట్టడుగు స్థాయిలో మార్పునకు ఊతమిస్తున్న పీఎంఈజీపీ
సాధారణ వ్యక్తుల ఆకాంక్షలను విజయవంతమైన వ్యాపారాలుగా మలచటంలో పీఎంఈజీపీ కీలక పాత్ర పోషిస్తోంది. పూచీకత్తు మొత్తాన్ని (ఎంఎం) సబ్సిడీతో సులభతర రుణ సౌకర్యాన్ని అందించటం ద్వారా ఇది మొదటితరం పారిశ్రామికవేత్తలకు లాభసాటి పరిశ్రమల స్థాపనకు, ఉద్యోగార్థులను ఉద్యోగ సృష్టికర్తలుగా మార్చేందుకు తోడ్పడుతోంది.
పారిశ్రామిక ఆకాంక్షలను లాభసాటి సంస్థలుగా మార్చుకున్న ఎంతోమంది లబ్ధిదారుల స్ఫూర్తిదాయక ప్రయాణాలే పీఎంఈజీపీ విజయానికి అసలైన నిదర్శనం.
స్కిన్‌కాంతి ఆయుర్వేద - సూక్ష్మ పరిశ్రమ నుంచి దేశంలోనే అగ్రగామిగా: హిమాచల్‌ప్రదేశ్‌లోని పర్వానూ కేంద్రంగా శ్రీమతి పూజా శర్మ స్థాపించిన 'స్కిన్‌కాంతి ఆయుర్వేద'... చిన్న, సూక్ష్మ పరిశ్రమ స్థాయి నుంచి భారతదేశ అతిపెద్ద హ్యాండ్‌మేడ్ సబ్బుల తయారీ యూనిట్‌గా అద్భుతమైన వృద్ధిని సాధించింది. రూ. 25 లక్షల ప్రాజెక్టు వ్యయంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ప్రారంభమైన ఈ సంస్థ... నేడు రూ.30 కోట్ల వార్షిక టర్నోవర్‌తో అద్భుతమైన వృద్ధిని కనబరుస్తూ 300 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇందులో 95 శాతం మంది మహిళలే కావటం విశేషం. ఆయుర్వేద సూత్రాలను ఆధునిక శాస్త్రీయ పద్ధతులతో మేళవించి, తయారీలో సామర్థ్యాన్ని పెంచుకోవటంతో పాటు ఖర్చును తగ్గించుకోవటంలో ఈ యూనిట్ కీలకమైన సాంకేతిక పురోగతిని సాధించింది. అంతేకాక వివిధ రిటైల్, సంస్థాగత మార్గాల ద్వారా భారత్ వ్యాప్తంగా ఉత్పత్తులను సరఫరా చేస్తోంది.
ఎంఎస్ ఈఎస్ఎస్ పీఈఈ క్వాలిటీ ప్రొడక్ట్స్ – పీఎంఈజీపీ మద్దతు నుంచి ప్రపంచ స్థాయి గుర్తింపు వరకు:
పంజాబ్‌లోని మొహాలీలో శ్రీ సురేందర్ పాల్ సింగ్ నాగి స్థాపించిన ఎంఎస్ ఈఎస్ఎస్ పీఈఈ క్వాలిటీ ప్రొడక్ట్స్ సంస్థ, అంతర్జాతీయంగా పోటీ పడగల ఆహార శుద్ధి పరిశ్రమగా ఎదిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థిక సహకారంతో రూ. 21 లక్షల ప్రాథమిక ప్రాజెక్టు వ్యయంతో ప్రారంభమైన ఈ యూనిట్... నేడు రూ. 38 కోట్ల టర్నోవర్ గల వ్యాపారంగా వృద్ధి చెందింది. సుమారు 130 మందికి ఉపాధి కల్పిస్తోంది. తేనె, బిస్కెట్లు, పండ్ల జామ్‌లను ఈ సంస్థ తయారు చేస్తుంది. వాటిని అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌తో సహా మొత్తం 26 దేశాలకు ఎగుమతి చేస్తోంది. ప్రతిష్ఠాత్మక ఏఏప్లస్ బీఆర్‌సీజీఎస్ సర్టిఫికేషన్‌ను సాధించటం ద్వారా ఈ సంస్థ ప్రపంచ స్థాయి నాణ్యత, భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఈ పథకం మన దేశంలో పారిశ్రామికతను ప్రోత్సహించటంలో, సూక్ష్మ పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడటంలో, ఉపాధి కల్పనతో పాటు సమగ్ర వృద్ధికి కీలక శక్తిగా మారుతుందని పీఎంఈజీపీ పారిశ్రామికవేత్తల విజయ గాథలు స్పష్టం చేస్తున్నాయి.
ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఈ పథకం గురించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు, దరఖాస్తులను సమర్పించేందుకు అధికారిక పీఎంఈజీపీ పోర్టల్ https://pmegp.msme.gov.in/ ను సందర్శించవచ్చు
****.
(రిలీజ్ ఐడి: 2318666)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6