ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా క్రీడల్లో పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ స్వర్ణ పతక సుజీత్‌కు ప్రధానమంత్రి అభినందనలు
నాడు పోస్టు చేయడమైనది:
02 OCT 2026 6:15PM by PIB Hyderabad
ఆసియా క్రీడల్లో పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగం ఉత్కంఠభరిత తుదిపోరులో ప్రత్యర్థిని మట్టిగరిపించి స్వర్ణ పతకం కైవసం చేసుకున్న సుజీత్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
తొలిసారి ఆసియా క్రీడల్లో పాల్గొన్న సుజీత్ మాతృభూమికి తొలి రెజ్లింగ్ స్వర్ణాన్ని సాధించిపెట్టాడని ప్రధానమంత్రి అన్నారు. ఆయనకు ఇదొక చిరస్మరణీయ విజయమని అభివర్ణించారు. భవిష్యత్తులోనూ అతడు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా ప్రధానమంత్రి కార్యాలయం పంపిన సందేశంలో:
“ఆసియా క్రీడల్లో పురుషుల రెజ్లింగ్ 65 కిలోల విభాగంలో ఉత్కంఠభరిత పోరు అనంతరం స్వర్ణం సాధించిన సుజీత్‌కు నా హృదయపూర్వక అభినందనలు. తన తొలి ఆసియా క్రీడల్లోనే భారత్‌కు తొలి రెజ్లింగ్ స్వర్ణం సాధించడం ఎంతో ప్రత్యేకం. నిజంగా ఇదొక చిరస్మరణీయ విజయం! భవిష్యత్తులోనూ అతడు మరింత రాణించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పేర్కొన్నట్లు తెలిపింది.
***
(రిలీజ్ ఐడి: 2318403)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10