ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా క్రీడల్లో మహిళల డింగీ విభాగం కాంస్య పతకం సాధించిన నేత్ర కుమనన్‌కు ప్రధానమంత్రి అభినందనలు

నాడు పోస్టు చేయడమైనది: 02 OCT 2026 6:07PM by PIB Hyderabad

ఆసియా క్రీడల్లో మహిళల డింగీ విభాగం కాంస్య పతక విజేత నేత్ర కుమనన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారత్‌కు ఈ రూపంలో ఆమె విశిష్ట విజయం సాధించి పెట్టిందని పేర్కొన్నారు.

 

నేత్ర కుమనన్ భవిష్యత్తులోనూ మరింతగా రాణించాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు. అలాగే దేశంలోని నవతరం క్రీడాకారులకు ఆమె ఎంతో స్ఫూర్తినివ్వగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా ప్రధానమంత్రి కార్యాలయం పంపిన సందేశంలో:

 

“ఆసియా క్రీడల్లో మహిళల డింగీ విభాగం కాంస్య పతక విజేత నేత్ర కుమనన్‌కు నా మనఃపూర్వక అభినందనలు! ఇది నిజంగా భారత్‌కు ఎంతో గొప్ప విజయం. భవిష్యత్తులోనూ ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను. అలాగే, దేశంలోని నవతరం క్రీడాకారులకు స్ఫూర్తి ప్రదాతగా నిలవాలని ఆశిస్తున్నాను” అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పేర్కొన్నట్లు తెలిపింది.

 

***


(రిలీజ్ ఐడి: 2318401) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Gujarati , Tamil , Malayalam