ఆర్థిక మంత్రిత్వ శాఖ
4.240 కిలోల నల్లమందును స్వాధీనం చేసుకున్న సీబీఎన్ మధ్యప్రదేశ్ యూనిట్ ఒకరి అరెస్టు
నాడు పోస్టు చేయడమైనది:
02 OCT 2026 3:17PM by PIB Hyderabad
సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ (సీబీఎన్) మధ్యప్రదేశ్ విభాగం తమ నిరంతర మాదకద్రవ్యాల నిరోధక కార్యకలాపాల్లో భాగంగా ఒక కీలకమైన ముందడుగు వేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు 30.09.2026న కంజర్దా–మానస రహదారిపై ఒక హీరో గ్లామర్ మోటార్‌సైకిల్ తనిఖీలో 4.240 కిలోల నల్లమందును స్వాధీనం చేసుకుంది. ఈ స్వాధీనానికి సంబంధించి ఒక వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు. నిషేధిత వస్తువుల రవాణాకు ఉపయోగించిన మోటార్‌సైకిల్‌నూ స్వాధీనం చేసుకున్నారు.
నీముచ్ రిజిస్ట్రేషన్ గల హీరో గ్లామర్ మోటార్‌సైకిల్‌పై ఒక వ్యక్తి కంజర్దా నుంచి మానస వైపు సుమారు 4–5 కిలోల నల్లమందును తీసుకు వెళ్తున్నాడని విశ్వసనీయ సమాచారం అందడంతో సీబీఎన్ మందసౌర్, పి&ఐ సెల్ అధికారుల బృందాన్ని అనుమానిత మార్గంలో మోహరించారు.
ఈ బృందం కంజర్ద-మానస మార్గంలో కట్టుదిట్టమైన నిఘా ఉంచింది. అనుమానిత మోటార్‌సైకిల్‌ను గుర్తించిన అధికారులు, దానిని అడ్డగించి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో మొత్తం 4.240 కిలోల నల్లమందు ఉన్న రెండు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
అవసరమైన అన్ని చట్టపరమైన లాంఛనాలను పూర్తి చేసిన తర్వాత, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం-1985లోని సంబంధిత నిబంధనల ప్రకారం... హీరో గ్లామర్ మోటార్‌సైకిల్‌తో పాటు స్వాధీనం చేసుకున్న నల్లమందునూ జప్తు చేసి, వ్యక్తిని అరెస్టు చేశారు.
నిషేధిత సరుకు మూలం, ఉద్దేశించిన గమ్యస్థానాన్ని నిర్ధారించడం, ఈ అక్రమ రవాణా నెట్‌వర్క్‌తో ఇతర వ్యక్తుల సంబంధాలను గుర్తించడం లక్ష్యంగా తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
నిరంతర నిఘా ఆధారిత అమలు చర్యల ద్వారా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ కట్టుబడి ఉంది. నషా ముక్త్ భారత్ దార్శనికత పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2318382)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11