వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అమెరికాలోని మిల్వాకీలో జీ20 వాణిజ్య మంత్రుల సమావేశం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌

భారత్‌ ఆహార భద్రత చర్యలను వివరించిన శ్రీ పీయూష్‌ గోయల్‌.. నియమాధారిత బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థ పట్ల నిబద్ధతను స్పష్టం చేసిన కేంద్ర మంత్రి



బలవంతపు వాణిజ్య చర్యల ద్వారా ఆహారాన్ని ఆయుధంగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ జి20 వాణిజ్య మంత్రుల ఏకాభిప్రాయ ప్రకటన



జీ20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా కీలక జీ20 భాగస్వామ్య దేశాల వాణిజ్య మంత్రులు, ప్రతినిధులతో శ్రీ పీయూష్‌ గోయల్‌ ద్వైపాక్షిక సమావేశాలు

నాడు పోస్టు చేయడమైనది: 01 OCT 2026 7:59PM by PIB Hyderabad

అమెరికా జీ20 అధ్యక్షతన విస్కాన్సిన్‌ రాష్ట్రం మిల్వాకీలో జరిగిన జీ20 వాణిజ్య మంత్రుల సమావేశం ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌ పాల్గొన్నారు.

 

ఆహారం, వాణిజ్యంపై జరిగిన సమావేశంలో శ్రీ గోయల్‌ మాట్లాడుతూ.. చర్చల్లో ఆహారాన్ని ప్రధాన అంశంగా ఉంచినందుకు జీ20 అధ్యక్ష దేశానికి కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ ఆహార భద్రత కల్పించడం, రైతులకు మరిన్ని అవకాశాలను సృష్టించడం భారత్‌ విధానంలో కీలకమైన అంశాలని ఆయన అన్నారు. ఏ దేశంపైనా ఒత్తిడి తెచ్చేందుకు ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాధనంగా ఉపయోగించకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఘర్షణల కారణంగా ఏర్పడుతున్న ఆహారం, ఇంధనం, ఎరువుల సంక్షోభాల ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాలపై అత్యధికంగా పడుతోందని పేర్కొన్నారు. నేటి ఎరువుల కొరత రేపటి ఆహార సంక్షోభంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. 

 

కోవిడ్‌-19 మహమ్మారి సమయంలో భారత్‌ 140 కోట్లకు పైగా ప్రజలకు ఆహార భద్రత కల్పించడంతో పాటు, అవసరంలో ఉన్న పలు దేశాలకు ఆహార ధాన్యాలను సరఫరా చేసిందని శ్రీ గోయల్‌ తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో 80 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

భారత్‌ ప్రభుత్వ నిల్వలను నిర్వహిస్తోందని, చిన్న, సన్నకారు రైతుల నుంచి పంటలను కొనుగోలు చేస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు. పంట దిగుబడి తగ్గిన సందర్భాల్లో ఆహారం అందుబాటులో ఉండేలా.. ప్రజలకు అందుబాటు ధరల్లో లభించేలా తాత్కాలిక, పారదర్శక చర్యలను చేపడుతున్నామని చెప్పారు. బాలి మంత్రివర్గ నిర్ణయం, జెనీవా మంత్రివర్గ ప్రకటనతో సహా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) పరిధిలో ఈ చర్యలకు గుర్తింపు ఉందని ఆయన పేర్కొన్నారు. ఆహార భద్రతను నిర్ధారించేందుకు తీసుకునే చర్యలకు, ఒత్తిడి తీసుకురావడానికి తీసుకున్న బలవంతపు వాణిజ్య చర్యలకు మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

 

ప్రస్తుతమున్న వివిధ వ్యవస్థలను కూడా శ్రీ గోయల్‌ ప్రస్తావించారు. ఇందులో 2011లో ఏర్పాటు చేసిన జీ20 వ్యవసాయ మార్కెట్‌ సమాచార వ్యవస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ 12వ మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన ప్రపంచ ఆహార కార్యక్రమం,కొనుగోళ్లను ఎగుమతి పరిమితుల నుంచి మినహాయించడం వంటి అంశాలు ఉన్నాయి. డబ్ల్యూటీఓను కేంద్రంగా చేసుకుని నియమాధారిత, న్యాయబద్ధమైన, వివక్షరహిత, సమానమైన, పారదర్శక, బహిరంగ, సమ్మిళిత, బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థ పట్ల భారత్‌ తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని ఆయన తెలిపారు.

 

‘బలవంతపు వాణిజ్య చర్యల ద్వారా ఆహారాన్ని ఆయుధంగా మార్చడంపై జీ20 ప్రకటన’ తుది పత్రంపై మంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ అంశంపై తమ సహకారాన్ని కొనసాగించాలన్న ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు.

అంతకుముందు జీ20 వాణిజ్య మంత్రులు, అమెరికా వాణిజ్య ప్రతినిధి అంబాసిడర్‌ జేమీసన్‌ గ్రీర్‌తో కలిసి విస్కాన్సిన్‌లోని మెక్వాన్‌లో ఉన్న రాక్‌వెల్‌ ఆటోమేషన్‌ కార్యాలయం, కర్మాగారాన్ని కేంద్ర మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌ సందర్శించారు.

 

సమావేశం సందర్భంగా జరిగిన ద్వైపాక్షిక భేటీల్లో పలు దేశాల ఉన్నతాధికారులు, మంత్రులతో శ్రీ గోయల్‌ భేటీ అయ్యారు. వారిలో బ్రెజిల్‌ అభివృద్ధి, పరిశ్రమ, వాణిజ్య, సేవలు విదేశాంగ మంత్రి.. అమెరికా వాణిజ్య ప్రతినిధి.. ఆర్థిక, భద్రతకు సంబంధించిన యూరోపియన్‌ కమిషనర్‌, యూకే వ్యాపార, ఆవిష్కరణ, విజ్ఞాన శాస్త్ర, వాణిజ్య శాఖ కార్యదర్శి, బోర్డ్‌ ఆఫ్‌ ట్రేడ్‌ అధ్యక్షుడు.. మెక్సికో ఆర్థిక శాఖ కార్యదర్శి.. పోలాండ్‌ దేశ ఆర్థిక, ఆర్థిక వ్యవహారాల మంత్రి ఉన్నారు.

 

మిల్వాకీ ఆర్ట్ మ్యూజియంలో అమెరికా వాణిజ్య ప్రతినిధి అంబాసిడర్‌ గ్రీర్‌, అమెరికా వ్యవసాయ శాఖ కార్యదర్శి రోలిన్స్ ఏర్పాటు చేసిన స్వాగత విందులో కూడా కేంద్ర మంత్రి పాల్గొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2318359) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati