ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రపంచ పర్యాటక కేంద్రంగా భారత్ పురోగతి.. వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 01 OCT 2026 4:20PM by PIB Hyderabad

కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్‌ షెకావత్‌ రాసిన ఓ కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

 

ప్రపంచ పర్యాటక రంగంలో భారత్‌ వేగంగా ఎదుగుతున్న తీరును ఈ కథనం వివరిస్తోంది. మెరుగైన రవాణా సౌకర్యాలు, పర్యాటకులకు మెరుగైన సదుపాయాలు, సులభమైన డిజిటల్‌ సేవల అందుబాటు వంటివి భారత్‌ పర్యాటక రంగం అభివృద్ధికి దోహదపడుతున్నాయని ఇందులో పేర్కొన్నారు. ఈ అభివృద్ధి వల్ల స్థానిక వ్యాపారాలు, పర్యాటక గైడ్‌లు, కళాకారులు, స్థానిక ప్రజలకు కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని తెలిపింది.

 

పర్యాటక రంగం తదుపరి దశలో సుస్థిరతకు కీలక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని కూడా ఇందులో ప్రస్తావించారు. భారత్ గొప్ప వారసత్వాన్ని ఆర్థిక అవకాశాలంతో అనుసంధానిస్తూ.. పర్యాటకులకు మరింత మెరుగైన అనుభవాలను అందించే దిశగా దేశం ముందుకు సాగుతోందని కథనం పేర్కొంది.

 

సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.

 

‘‘ప్రపంచ పర్యాటక రంగంలో భారత్‌ ఎదుగుదలకు మెరుగైన రవాణా అనుసంధానం, పర్యాటక సదుపాయాల అభివృద్ధి, సులభమైన డిజిటల్‌ సేవలు దోహదపడుతున్నాయని కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్‌ షెకావత్‌ తన కథనంలో పేర్కొన్నారు. ఈ అభివృద్ధి స్థానిక వ్యాపారాలు, గైడ్‌లు, కళాకారులు, ప్రజలకు కొత్త అవకాశాలను అందిస్తోంది.

 

పర్యాటక రంగం తదుపరి దశలో సుస్థిరతకు ప్రాధాన్యం ఇస్తూ, భారత్‌ తన గొప్ప వారసత్వాన్ని ఆర్థిక అవకాశాలతో అనుసంధానం చేయడంతో పాటు, ప్రయాణికులకు మరింత మెరుగైన అనుభవాలను అందిస్తోంది’’


(రిలీజ్ ఐడి: 2318327) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam