సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి జ్ఞాపికల ఈ-వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పంజాబ్ వారసత్వం, భాంగ్రా- దిల్జిత్ దోసాంజ్
పంజాబ్ ఆధ్యాత్మిక విశ్వాసాలు, వారసత్వం, సమకాలీన సంస్కృతిని తెలియజేసే జ్ఞాపికలపై బిడ్ వేసేందుకు అవకాశాన్ని కల్పిస్తోన్న ప్రధానమంత్రి జ్ఞాపికల ఈ-వేలం
నాడు పోస్టు చేయడమైనది:
01 OCT 2026 5:16PM by PIB Hyderabad
‘పీఎం జ్ఞాపికల ఈ-వేలం 2026’లో ఉన్న ప్రత్యేకమైన జ్ఞాపికలు.. పంజాబ్‌కు ఉన్న అనేక కోణాలు, దాని విశ్వాసం, చరిత్ర, సంగీతం, నృత్యం, సజీవ సంప్రదాయాలను అద్భుతంగా ప్రదర్శిస్తున్నాయి. స్వర్ణ దేవాలయపు సూక్ష్మ ప్రతిరూపాలు, సిక్కు ఆధ్యాత్మిక ప్రముఖుల చిత్రపటాలు, భాంగ్రా- దిల్జిత్ దోసాంజ్ ప్రపంచ స్థాయి సంగీత ప్రయాణాన్ని చాటిచెప్పే జ్ఞాపికలు కాలాతీత వారసత్వాన్ని, సమకాలీన సాంస్కృతిక అభివ్యక్తిని ఒకచోట చేర్చాయి.
స్వర్ణ దేవాలయానికి సంబంధించిన ఒక జ్ఞాపికలో శ్రీ హర్మందిర్ సాహిబ్ వివరణాత్మక సూక్ష్మ నమూనా ఉంది. ఇంకొక దానిలో ఆ పుణ్యక్షేత్రం ఒక గాజు గోపురంలో ఉండటంతో తేలియాడేలా కనిపిస్తుంది. ఇవి రెండూ అమృత్‌సర్‌లోని ఈ ప్రసిద్ధ క్షేత్రానికి సంబంధించిన వాస్తుశిల్ప, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి.
వారణాసి, గురుబాగ్‌లోని గురుద్వారా మేనేజింగ్ కమిటీ ఇచ్చిన వెండి ఫ్రేమ్‌తో కూడిన చిత్రపటం ద్వారా ఈ జ్ఞాపిక గురునానక్ దేవ్ జీని కలిగి ఉంది. సిక్కు చరిత్రలో వారి స్థానాన్ని.. వారి గాథతో ముడిపడి ఉన్న ధైర్యం, త్యాగం, విశ్వాసాల విలువలను గుర్తుచేస్తూ చిన్న సాహిబ్జాదాలు జోరావర్ సింగ్, ఫతే సింగ్‌లతో కూడిన మాతా గుజ్రికి సంబంధించిన మరొక అద్భుతమైన కళాఖండాన్ని ఇందులో ప్రదర్శించారు.
పంజాబ్ శక్తిమంతమైన సాంస్కృతిక గుర్తింపు.. భాంగ్రా పెయింటింగ్ సజీవంగా రూపుదిద్దుకుంది. ఇది సంప్రదాయ జానపద నృత్యం కదలికలు, రంగులు ఉత్సవ స్ఫూర్తిని అద్భుతంగా ఆవిష్కరిస్తోంది. పంజాబీ సంగీతం, జనాదరణ పొందిన సంస్కృతి ప్రపంచవ్యాప్త వ్యాప్తిని చాటిచెబుతూ దిల్జిత్ దోసాంజ్ 'దిల్-లుమినాటి టూర్' ఫోటోప్రింట్‌తో ఈ సేకరణ ఒక సమకాలీన కోణాన్ని కూడా సంతరించుకుంది.
ఆధ్యాత్మిక, సామాజిక సంస్కర్త అయిన సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ ఆశీర్వదించే భంగిమలో ఉన్న ఫ్రేమ్డ్ చిత్రపటం మరో విశేషమైన ఆకర్షణగా నిలిచింది. సిక్కు ప్రార్థనా స్థలాల్లో వినయం, భక్తికి సంప్రదాయ చిహ్నమైన బంగారు దారపు పనితనంతో కూడిన కుంకుమపువ్వు రంగు గురుద్వారా తలపాగాలతో ఇది ఉంది.
పవిత్ర ప్రదేశాలు, ఆధ్యాత్మిక సంప్రదాయాల నుంచి జానపద సంస్కృతి, సమకాలీన సంగీతం వైపు సాగే ప్రయాణాన్ని ఈ జ్ఞాపికలన్నీ కలిసి తెలియజేస్తున్నాయి. ఇవి పంజాబ్‌కు సంబంధించిన విభిన్న సాంస్కృతిక రూపాల సంగ్రహావలోకనాన్ని అందిస్తాయి.
ప్రధానమంత్రి జ్ఞాపికల ఈ-వేలం బిడ్లు దాఖలు చేసేందుకు ప్రజలకు చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ-వేలం ద్వారా వచ్చే ఆదాయం 'నమామి గంగే మిషన్'కు మద్దతుగా ఉపయోగపడుతుంది. మీ బిడ్ దాఖలు చేసేందుకు pmmementos.gov.in ని చూడండి.
***
(రిలీజ్ ఐడి: 2318319)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5