ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా క్రీడల్లో పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించిన

గణేశ్ మణిరత్నం తిరుమూరుకు ప్రధాని అభినందన

నాడు పోస్టు చేయడమైనది: 01 OCT 2026 4:45PM by PIB Hyderabad

ఆసియా క్రీడల్లో పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత కాంస్య పతక పోరులో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధించిన గణేశ్ మణిరత్నం తిరుమూరుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

 

ఒత్తిడిలోనూ కచ్చితత్వంతో.. అద్భుతమైన సంయమనం, మొక్కవోని సంకల్పంతో గణేశ్ మణిరత్నం తిరుమూరు ఈ ఘనతను సాధించారని శ్రీ మోదీ పేర్కొన్నారు.

 

భవిష్యత్తులో ఆయన మరెన్నో విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొన్నది:

 

“ఆసియా క్రీడల్లో పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత కాంస్య పతక పోరులో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధించిన గణేశ్ మణిరత్నం తిరుమూరుకు అభినందనలు. ఒత్తిడిలోనూ కచ్చితత్వంతో.. అద్భుతమైన సంయమనం, మొక్కవోని సంకల్పంతో గణేశ్ ఈ ఘనతను సాధించారు. భవిష్యత్తులో ఆయన మరెన్నో విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తూ... శుభాకాంక్షలు.: ప్రధానమంత్రి @narendramodi” 

 


(రిలీజ్ ఐడి: 2318310) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam