సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పశ్చిమబెంగాల్ వైవిధ్యభరితమైన సాంస్కృతిక, కళాత్మక వారసత్వాన్ని చాటిచెప్పిన 109 జ్ఞాపికల వేలం

జ్ఞాపికల్లో ఉన్న దుర్గాపూజా సంప్రదాయ వస్తువులు, షోలాపిత్, డోక్రా హస్తకళలు, బంకురా కళ, టెర్రకోట వారసత్వం, మతపరమైన ఆచారాలు, ప్రముఖ వ్యక్తుల చిత్రపటాలు

నాడు పోస్టు చేయడమైనది: 30 SEP 2026 5:42PM by PIB Hyderabad

పీఎం జ్ఞాపికల 8వ ఎడిషన్ ఇ-వేలం 2026లో పశ్చిమబెంగాల్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ రాష్ట్ర కళాత్మక, సాంస్కృతిక, మతపరమైన, వారసత్వ సంప్రదాయాలను ప్రతిబింబించేలా మొత్తం 109 జ్ఞాపికలు వేలంలో ఉన్నాయి. ఈ సేకరణలో సంప్రదాయ హస్తకళలు, భక్తిపూర్వక కళాఖండాలు, వారసత్వ కట్టడాల నమూనాలు, జానపద కళారూపాలు, ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన జ్ఞాపికలు ఉన్నాయి.

 

పీఎం జ్ఞాపికల 8వ ఎడిషన్ ఇ-వేలం అక్టోబర్ 2, 2026 వరకు ఆన్‌లైన్‌లో జరుగుతుంది. పూర్తి వివరాలు, ఇందులో పాల్గొనే విధానం, కేటలాగ్ కోసం అధికారిక పీఎం మెమొంటోస్ ఈ-వేలం పోర్టల్ pmmementos.gov.in. ను సందర్శించండి.

 

పశ్చిమబెంగాల్ సేకరణలో ప్రదర్శించిన ప్రముఖ జ్ఞాపికల్లో కొన్ని:

 

ఈ సేకరణలో రెండు జ్ఞాపికలు ఆధ్యాత్మిక జ్ఞానం, యోగ, భక్తి బోధనలకు పేరుగాంచిన ప్రఖ్యాత భారత ఆధ్యాత్మిక గురువు, సాధువు బాబా లోకనాథ్ విగ్రహాలు. వాటిలో ఒకటి సిరామిక్‌తో, మరొకటి వేరే పదార్థంతో చేసినది.

 

మరో జ్ఞాపికలో పశ్చిమబెంగాల్‌కు చెందిన సంప్రదాయ షోలా కళ ద్వారా రూపుదిద్దుకున్న దుర్గాదేవి ముఖచిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

 

పశ్చిమబెంగాల్‌లోని విశిష్టమైన స్మారక చిహ్నాన్ని రాటన్ కేన్‌తో చేతితో అల్లిన శిల్పకళాఖండంగా అద్భుతంగా ఈ జ్ఞాపిక కనిపిస్తుంది. సంక్లిష్టమైన అల్లిక, సహజమైన కళారూపంతో ఉన్న ఈ జ్ఞాపిక.. గ్రామీణ వారసత్వంలో వేళ్లూనుకున్న సుస్థిర చేతివృత్తుల నైపుణ్యాన్ని చాటుతుంది.

 

పశ్చిమబెంగాల్ జానపద కళా వారసత్వాన్ని ప్రతిబింబించే చేతితో చెక్కిన ఒక జత చెక్క బంకురా గుర్రాలను ఈ జ్ఞాపికలో చూడవచ్చు. సాగదీసినట్లు ఉండే పొడవైన మెడలు, నిటారుగా ఉన్న చెవులు, పంచముర కళా శైలికి చెందిన రేఖీయ రూపాలతో ఈ శిల్పాలు విశేషంగా రూపుదిద్దుకున్నాయి.

చేతితో చేసిన షోలాపిత్ కళాఖండం కాళీమాత ప్రతిమ కూడా ఈ సేకరణలో ఒక భాగం. బెంగాలీ సంప్రదాయానికి చెందిన ఐవరీ తెలుపు షోలాపిత్ పదార్థంతో చేసిన ఈ కళాఖండంలో దేవత ముఖం, మూడో కన్ను, అంతస్తులుగా ఉన్న కిరీటంతో పాటు అలంకరణ వస్తువులు చెక్కి ఉన్నాయి.

 

బిష్ణుపూర్‌లోని చరిత్రాత్మక రసమంచ స్మారక కట్టడాన్ని, దాని ప్రత్యేకమైన పిరమిడ్ ఆకారపు టెర్రకోట నిర్మాణం, వంపు తిరిగిన గ్యాలరీలను కళ్లకు కట్టేలా చేతితో వేసిన కాన్వాస్ పెయింటింగ్ ఇది. నివేదిత నేమ అనే కళాకారిణి ఈ పెయింటింగ్ వేశారు.

 

పశ్చిమబెంగాల్ సేకరణలో రవీంద్రనాథ్ ఠాగూర్, బంకించంద్ర చటోపాధ్యాయ, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, స్వామి వివేకానంద, సత్యజిత్ రేలకు సంబంధించిన జ్ఞాపికలతో పాటు మదనమోహన్ ఆలయం, జల్వేశ్ ఆలయం, తారాపిఠ్, దక్షిణేశ్వర్, కల్నా వారసత్వ ఆలయాలు, బంకురా జానపద సంప్రదాయాలు, దుర్గాపూజ హస్తకళల ప్రతీకలున్నాయి.

 

పశ్చిమబెంగాల్ భక్తి సంప్రదాయాలు, జానపద, హస్తకళా పద్ధతులు, నిర్మాణ వారసత్వం, సాహిత్య, కళాత్మక వారసత్వం, సమకాలీన స్మారక కళాఖండాలు మొత్తంగా ఈ 109 జ్ఞాపికలు ఆ రాష్ట్ర సమగ్ర చిత్రాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

 

****

 


(రిలీజ్ ఐడి: 2318304) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , हिन्दी , Marathi , Bengali , English