గనుల మంత్రిత్వ శాఖ
‘స్వచ్ఛతా హీ సేవా-2026’లో భాగంగా పరిశుభ్రత ఉద్యమానికి సారథ్యం వహించిన కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి
పరిశుభ్ర భారత్‌ను ఆవిష్కరించే దిశగా సామూహిక కార్యకలాపాలు చేపట్టాలంటూ పిలుపునిచ్చిన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
01 OCT 2026 11:55AM by PIB Hyderabad
‘స్వచ్ఛతా హీ సేవా-2026’లో భాగంగా అక్టోబర్ 1న చాణక్యపురిలోని యశ్వంత్ ప్యాలెస్ మార్కెట్టులో నిర్వహించిన శుభ్రత కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి పాల్గొన్నారు. బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ కేశవ్ చంద్రతో పాటు మంత్రిత్వ శాఖ, ఎన్‌డీఎమ్‌సీల సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. గాంధీ జయంతికి ఒక రోజు ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి పారిశుధ్య కార్మికులతో మాట్లాడారు. బహిరంగ స్థలాలను నిర్మలంగా ఉంచడానికి వారు అంకిత భావంతో సేవలను అందిస్తున్నారని ఆయన ప్రశంసించారు. స్వచ్ఛత పరిరక్షణ అందరి బాధ్యత అని, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా అట్టిపెట్టుకోవడంలో అందరూ చురుకుగా తోడ్పాటును అందించాలని ఆయన స్పష్టం చేశారు.
కాలవలు, ఆరుబయలు ప్రదేశాలు, రహదారులు, చెరువుల్లో చెత్తను పారవేయొద్దని, భవనాల్లో లేదా ఇతర చోట్ల నుంచి వ్యర్థాలను తీసుకువచ్చి ఎక్కడ పడితే అక్కడ విసరివేయడం మానుకోవాలని పౌరులకు మంత్రి పిలుపునిచ్చారు. శుద్ధతను కాపాడుకోవాలంటే సామూహిక జాగరూకతతో పాటు నిరంతర ప్రాతిపదికన ప్రజల భాగస్వామ్యం ఎంతయినా అవసరమని ఆయన ఉద్బోధించారు.

రోజూ తెల్లవారు ఝామునే పనులు మొదలుపెట్టి, ప్రజలకు పరిశుభ్రమైన పరిసరాలను అందించడానికి పాటుపడే పారిశుధ్య సిబ్బంది సేవలను గుర్తించి, గౌరవించుకోవడం ముఖ్యమని శ్రీ జి. కిషన్ రెడ్డి ప్రస్తావించారు. స్వచ్ఛతను నిత్య జీవితంలో ఓ విడదీయరాని భాగంగా మార్చుకోవడం కోసం మరింత ఎక్కువ మంది ముందుకు రావాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో భాగంగా, ‘‘ఏక్ పేడ్ మా కే నామ్’’ (అమ్మ పేరిట ఒక మొక్క) ను కూడా చేపట్టారు. మొక్కలను నాటే కార్యక్రమంలో కేంద్ర మంత్రి, గనుల శాఖ కార్యదర్శితో పాటు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ఒక బాధ్యత.. పరిసరాలను శుభ్రంగా, పచ్చదనంతో నిండి ఉండేలా చేసుకోవడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలన్న సందేశాన్ని ఈ కార్యక్రమం చాటింది.

స్వచ్ఛతా హీ సేవా భావనతో పాటు, బహిరంగ స్థలాలను శుభ్రంగా ఉంచాలని, స్వచ్ఛ హరిత భారత్‌ను ఆవిష్కరించే దిశగా తోడ్పడడానికి ఉమ్మడి కార్యకలాపాలను కొనసాగించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ కార్యక్రమం ద్వారా సూచించారు.
పారిశుధ్య కార్మికులు, అధికారులు సహా ఆసక్తిదారులంతా చొరవ తీసుకుని స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో తలో చేయి వేసినందుకు కేంద్ర మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
***
(రిలీజ్ ఐడి: 2317570)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8