సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
ఆర్థిక సహాయం నుంచి విద్యా నైపుణ్యం వైపు
ఉన్నత విద్య, సామాజిక సాధికారత దిశగా తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన మీనాక్షి ప్రయాణం
నాడు పోస్టు చేయడమైనది:
30 SEP 2026 3:46PM by PIB Hyderabad
ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆర్థిక సహాయం కీలకంగా ఉపయోగపడుతుంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి తమ విద్యా లక్ష్యాలను సాధించేందుకు ఇది వారికి ధైర్యాన్ని ఇస్తుంది. సరైన సమయంలో అందించే ఈ ఆర్థిక సహాయం ద్వారా లబ్ధిదారులు తమ వర్గాల్లోని ఇతర విద్యార్థులను కూడా ఉన్నత చదువుల వైపు నడిపించేలా స్ఫూర్తినిచ్చే అవకాశాలను కల్పిస్తుంది.
షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గానికి చెందిన 36 ఏళ్ల మీనాక్షి ప్రస్తుతం పీహెచ్‌డీ పరిశోధకురాలిగా ఉన్నారు. ప్రముఖ విశ్వవిద్యాలయంలో బోధన, పరిశోధన, శాస్త్రీయ రంగాల్లో వృత్తిని కొనసాగించాలన్నది ఆమె లక్ష్యం. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యను కొనసాగించడం ఆమెకు పెద్ద సవాలుగా మారింది.
ఉన్నత విద్యకు అవకాశాలు పరిమితంగా ఉన్న సామాజిక వర్గం నుంచి వచ్చిన మీనాక్షి.. ఆర్థిక వనరుల కొరత, ఆత్మవిశ్వాస లోపం, అవకాశాల లభ్యత వంటి అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. సరైన ప్రోత్సాహం, సహకారం లేకపోవడం వల్ల ఆమె వర్గానికి చెందిన అనేక మంది విద్యార్థులు ధైర్యంగా ఉన్నత చదువుల వైపు అడుగులు వేయలేకపోయారు.
షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల కోసం అమలు చేస్తున్న షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల జాతీయ ఫెలోషిప్ (ఎన్ఎఫ్ఎస్‌సీ) పథకం కింద 2022–25 కాలంలో మీనాక్షికి రూ.11 లక్షల ఆర్థిక సహాయం అందింది. ఈ సాయంతో ఆమె ఆర్థిక ఇబ్బందుల ఇబ్బందులు లేకుండా తన ఉన్నత విద్యను విజయవంతంగా కొనసాగించి పూర్తి చేయగలిగారు.
అవసరానికి అందించే ఆర్థిక సహాయం చదువులో రాణించడానికి, సామాజిక సాధికారతకు ఏ విధంగా దారి చూపుతుందో చెప్పడానికి నేడు మీనాక్షి ప్రయాణం ఇక ఉదాహరణగా నిలిచింది. ఆర్థికంగా వెనుకబడిన, సామాజికంగా అణగారిన వర్గాలకు చెందిన ఇతర విద్యార్థులు కూడా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆమె ప్రయాణం ఎంతగానో స్ఫూర్తినిచ్చింది.
ఎన్ఎఫ్ఎస్‌సీ పథకం ద్వారా అందే ఆర్థిక సహాయం విద్యార్థులు తమ ఆర్థిక అడ్డంకులను అధిగమించడానికి, ఉన్నత విద్యను కొనసాగించడానికి, తమ వర్గానికి చెందిన ఇతరుల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఏ విధంగా దోహదపడుతుందో చెప్పడానికి మీనాక్షి అనుభవమే ప్రత్యక్ష నిదర్శనం.
ఈ పథకం కింద లభించిన తోడ్పాటుతో మీనాక్షి తన ఆర్థిక ఇబ్బందులను విద్యాభివృద్ధికి ఒక అవకాశంగా మలుచుకున్నారు. ఇతర విద్యార్థులు కూడా ఉన్నత చదువులు అభ్యసించి, సాధికారతతో కూడిన భవిష్యత్తు వైపు అడుగులు వేసేందుకే ఆమె ఒక స్ఫూర్తిగా నిలిచారు.
ఈ ఆర్థిక సహాయం, దాని ప్రయోజనాల గురించి మీనాక్షి మాట్లాడుతూ.. ‘‘నా హీహెచ్‌డీ పూర్తి చేయడానికి అవసరమైన ఆర్థిక మద్దతును ఎన్ఎఫ్ఎస్‌సీ పథకం అందించింది. ఈ రోజు నేను నా కలను నెరవేర్చుకోవడమే కాకుండా, మా వర్గానికి చెందిన ఇతర విద్యార్థులు కూడా పెద్ద కలలు కనేలా ప్రోత్సహిస్తున్నాను’’ అని తెలిపారు.
ఎన్ఎఫ్ఎస్‌సీ పథకం అందించిన ఈ ప్రోత్సాహం మీనాక్షిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, తన విద్యా లక్ష్యాలను సాధించడంలో సహాయపడింది. తన విద్యా ప్రయాణంలో, ఉన్నత చదువులు చదవాలనుకుని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇతర విద్యార్థుల విద్యకు కూడా ఆమె తన వంతు సహకారం అందించారు. ఆమె చూపిన బాట, అణగారిన వర్గాల విద్యార్థుల్లో ఉన్నత విద్య అనేది సాధించదగిన లక్ష్యమేననే నమ్మకాన్ని నింపింది.
***
(రిలీజ్ ఐడి: 2317345)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7