వ్యవసాయ మంత్రిత్వ శాఖ
2027-28 మార్కెటింగ్ సీజనుకు రబీ పంటల కనీస మద్దతు ధరలకు (ఎంఎస్పీ) కేంద్ర మంత్రివర్గం ఆమోదం
నాడు పోస్టు చేయడమైనది:
30 SEP 2026 3:19PM by PIB Vijayawada
2027-28 మార్కెటింగ్ సీజనుకు గాను నిర్దేశిత అన్ని రబీ పంటల కనీస మద్దతు ధరల (ఎంఎస్పీ) పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
రైతుల ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను అందించేందుకు వీలుగా.. 2027-28 మార్కెటింగ్ సీజన్‌కు గాను రబీ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అత్యధికంగా కుసుమల కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.675 పెంచగా... ఆ తర్వాత రాప్‌సీడ్, ఆవాలకు క్వింటాలుకు రూ. 413 పెంచారు. మసూర్, బార్లీ, శనగలు, గోధుమలకు వరుసగా క్వింటాలుకు రూ. 390, రూ. 136, రూ. 83, రూ. 25 చొప్పున మద్దతు ధరను పెంచారు.
మార్కెటింగ్ సీజన్ 2027-28లో అన్ని రబీ పంటలకు కనీస మద్దతు ధరలు
(క్వింటాలుకు రూ.లో)
|
క్ర.సం.
|
పంటలు
|
2027-28 రబీ మార్కెటింగ్ సీజనుకు ఎంఎస్పీ
|
2027-28 రబీ మార్కెటింగ్ సీజన్ ఉత్పత్తి వ్యయం*
|
ఉత్పత్తి వ్యయంపై ఆదాయం
(శాతంలో)
|
2026-27 రబీ మార్కెటింగ్ సీజన్‌లో ఎంఎస్పీ
|
ఎంఎస్పీలో పెరుగుదల
(మొత్తంగా)
|
|
1
|
గోధుమ
|
2610
|
1264
|
106
|
2585
|
25
|
|
2
|
బార్లీ
|
2286
|
1447
|
58
|
2150
|
136
|
|
3
|
శనగలు
|
5958
|
3751
|
59
|
5875
|
83
|
|
4
|
మసూర్ పప్పు
|
7390
|
3854
|
92
|
7000
|
390
|
|
5
|
రాప్ సీడ్, ఆవాలు
|
6613
|
3367
|
96
|
6200
|
413
|
|
6
|
కుసుమలు
|
7215
|
4810
|
50
|
6540
|
675
|
* కూలీలు, పశువులు/యంత్రాల వినియోగం వల్ల అయ్యే ఖర్చులు, కౌలు భూమికి చెల్లించిన అద్దె, విత్తనాలు, ఎరువులు, సేంద్రియ ఎరువులు, నీటిపారుదల ఖర్చులు, వ్యవసాయ పరికరాల తరుగుదల, నిర్వహణ మూలధనంపై వడ్డీ, పంపుసెట్ల నిర్వహణకు వాడిన డీజిల్/విద్యుత్ ఖర్చుల వంటి చెల్లింపులన్నింటితో పాటు.. ఇతర ఖర్చులు, కుటుంబ శ్రమకు విలువను అంచనా వేసి పరిగణించిన వ్యయాన్ని ఇది సూచిస్తుంది.
అఖిల భారత సగటు ఉత్పత్తి వ్యయానికి కనీసం 1.5 రెట్లు మద్దతు ధరను నిర్ణయించాలన్న 2018-19 కేంద్ర బడ్జెట్ ప్రకటనకు అనుగుణంగా.. 2027-28 మార్కెటింగ్ సీజనుకు గాను నిర్దేశిత రబీ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అఖిల భారత సగటు ఉత్పత్తి వ్యయంపై... గోధుమలకు అత్యధికంగా 106 శాతం, తర్వాత ఆవాలు, రాప్‌సీడ్‌లకు 96 శాతం, మసూర్‌కు 92 శాతం, శనగలకు 59 శాతం, బార్లీకి 58 శాతం, కుసుమలకు 50 శాతం ఆదాయం లభిస్తుందని అంచనా. రబీ పంటల కనీస మద్దతు ధరల్లో పెంపు రైతులకు లాభదాయకమైన ధరలను అందించడంతోపాటు పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహిస్తుంది.
ఇటీవలి కాలంలో పప్పుధాన్యాలు, నూనెగింజల వంటి పంటలకు అధిక కనీస మద్దతు ధరను కల్పించడం ద్వారా... తృణధాన్యాలు కాకుండా ఇతర పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
2004-05 నుంచి 2013-14 కాలంలో 2,254 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న గోధుమల కొనుగోలు.. 2014-15 నుంచి 2025-26 నాటికి 3,715 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. అలాగే 2004-05 నుంచి 2013-14 కాలంలో 6 రబీ పంటల మొత్తం కొనుగోలు 2,302 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉండగా.. 2014-15 నుంచి 2025-26 కాలానికి అది 3,921 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది.
2004-05 నుంచి 2013-14 కాలంలో గోధుమ రైతులకు చెల్లించిన కనీస మద్దతు ధర రూ. 2.56 లక్షల కోట్లుగా ఉండగా.. 2014-15 నుంచి 2025-26 నాటికి అది రూ. 7.31 లక్షల కోట్లకు పెరిగింది. అలాగే 2004-05 నుంచి 2013-14 కాలంలో 6 రబీ పంటలకు గాను రైతులకు చెల్లించిన కనీస మద్దతు ధర మొత్తం రూ. 2.65 లక్షల కోట్లుగా ఉండగా.. 2014-15 నుంచి 2025-26 నాటికి అది రూ. 8.36 లక్షల కోట్లకు పెరిగింది.
***
(రిలీజ్ ఐడి: 2317208)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11