మంత్రిమండలి
azadi ka amrit mahotsav

అంతర్రాష్ట ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అభివృద్ధికి గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్-III పథకానికి కేంద్ర మంత్రివర్గ ఆమోదం

నాడు పోస్టు చేయడమైనది: 30 SEP 2026 3:12PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్-III (జీఈసీ-III) పథకానికి ఆమోదం తెలిపింది. ఈ చరిత్రాత్మక కార్యక్రమం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 135 గిగావాట్ల (జీడబ్ల్యూ) పునరుత్పాదక విద్యుత్ సరఫరాకు వీలుగా భారతదేశ అంతర్రాష్ట గ్రిడ్ వ్యవస్థ (ఐఎన్ఎస్‌టీఎస్)ను బలపరుస్తుంది.

పునరుత్పాదక విద్యుత్ డెవలపర్లు, జనరేటర్ల వద్ద గ్రిడ్ సౌలభ్యం కోసం ప్రాముఖ్యత గల ఇతర ప్రాంతాల్లో అంతరాయాలు, రద్దీ, అధికంగా డిమాండ్ ఉన్న సమయాల్లో విద్యుత్ కోతలను అధిగమించేందుకు, సౌర విద్యుత్ లభించని సమయాల్లో డిమాండ్‌ను తీర్చేందుకు 50 గిగావాట్ అవర్ల (జీడబ్ల్యూహెచ్) బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (బీఈఎస్ఎస్) ఏర్పాటుకు ఈ పథకం అవకాశం కల్పిస్తుంది. ఈ పథకం రాష్ట్రాలు, యూటీల్లో గ్రిడ్ అనుసంధానాన్ని, విద్యుత్ సరఫరాను సులభతరం చేస్తుంది.

రూ.1,86,405 కోట్ల వ్యయంతో 2032-33 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ పథకాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్-III (జీఈసీ-III) ద్వారా అంతర్రాష్ట గ్రిడ్ వ్యవస్థ (ఐఎన్ఎస్‌టీఎస్) అభివృద్ధికి రూ.1,36,378 కోట్లు, 50 జీడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (బీఈఎస్ఎస్) కోసం రూ.50,000 కోట్లు కేటాయించారు. ఈ పథకానికి మొత్తం రూ.54,082 కోట్ల కేంద్ర ఆర్థిక సహాయం లభిస్తుంది. అంతర్రాష్ట్ర గ్రిడ్ ఛార్జీలను భర్తీ చేసేందుకు, విద్యుత్ ధరలను అదుపులో ఉంచేందుకు కేంద్ర ఆర్థిక సహాయం (సీఎఫ్ఏ) సహాయపడుతుంది. ప్రభుత్వ మద్దతు అంతిమంగా తుది వినియోగదారులైన భారత పౌరులకు ప్రయోజనం చేకూరుస్తుంది.

ఐఎన్ఎస్‌టీఎస్ ద్వారా వచ్చే అన్ని గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టులను టారిఫ్-బేస్డ్ కాంపిటీటివ్ బిడ్డింగ్ (టీబీసీబీ) విధానం ద్వారా అమలు చేస్తారు. బ్రౌన్‌ఫీల్డ్ అప్‌‌గ్రేడేషన్, నెట్‌వర్క్ పటిష్టత పనులను కాస్ట్ ప్లస్ బేసిస్ (సీపీబీ) ద్వారా చేపడతారు. స్టేట్ ట్రాన్స్‌మిషన్ యుటిలిటీస్... అమలు చేసే ఏజెన్సీగా వ్యవహరిస్తాయి. ట్రాన్స్‌మిషన్ సర్వీస్ ప్రొవైడర్స్ (టీఎస్‌పీలు) బిల్డ్-ఓన్-ఆపరేట్-మెయింటైన్ (భూం) నమూనా ద్వారా టీబీసీబీలో పాల్గొంటాయి.

2035 నాటికి 900 జీడబ్ల్యూ శిలాజేతర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్య లక్ష్యాన్ని సాధించేందుకు ఈ పథకం తోడ్పడుతుంది. ఇది దేశ దీర్ఘకాలిక శక్తి భద్రతను పెంపొందించటంతో పాటు కర్బన ఉద్గారాలను తగ్గించటం ద్వారా పర్యావరణపరంగా సుస్థిరమైన వృద్ధిని ప్రోత్సహిస్తుంది. విద్యుత్ రంగం, తయారీ, నిర్మాణ పరిశ్రమల్లో పెద్దఎత్తున ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలను ఈ పథకం సృష్టిస్తుంది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్) తయారీ, ఏర్పాటు... దేశీయ ఇంధన నిల్వ పరిశ్రమలో అదనపు ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. భాగస్వామ్య రాష్ట్రాల్లో కార్యాచరణ, నిర్వహణ, గ్రిడ్ నిర్వహణ రంగాల్లో దీర్ఘకాలిక నైపుణ్యంతో కూడిన ఉపాధిని ఈ పథకం కల్పిస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2317072) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam