ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 29 AUG 2026 10:34AM by PIB Hyderabad

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ క్రీడాభిమానులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాకారుల అంకితభావం, ఉత్సాహం, పట్టుదల యావత్ దేశానికే గర్వకారణమని అన్నారు.

 

భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్‌ గారికి ప్రధానమంత్రి నివాళులర్పించారు. ఆయన అసాధారణ ప్రతిభ, భారత హాకీకి అందించిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

 

“క్రీడాభిమానులందరికీ… మీ అంకితభావం, ఉత్సాహం, పట్టుదల ప్రతి ఒక్కరినీ గర్వపడేలా చేస్తాయి.

 

తరతరాలకు స్ఫూర్తినిస్తున్న దిగ్గజ మేజర్ ధ్యాన్‌చంద్‌ గారికి కూడా నివాళులర్పిస్తున్నాం.

 

#జాతీయక్రీడాదినోత్సవం’’      


(రిలీజ్ ఐడి: 2316855) సందర్శకుల సూచీ సంఖ్య : : 17