ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా క్రీడల్లో మహిళల హైజంప్‌ కాంస్య పతక విజేత పూజకు ప్రధానమంత్రి అభినందన

నాడు పోస్టు చేయడమైనది: 29 SEP 2026 9:37PM by PIB Hyderabad

ఆసియా క్రీడలు-2026లో మహిళల హైజంప్ కాంస్య పతకం సాధించిన పూజకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ క్రీడా విభాగంలో రెండు దశాబ్దాల అనంతరం భారత్‌కు లభించిన తొలి పతకం ఇదేనని పేర్కొంటూ, ఇదొక చిరస్మరణీయ ఘట్టమని ఆయన అభివర్ణించారు. భవిష్యత్తులో ఆమె మరింత మెరుగ్గా రాణించాలని ఆకాంక్షిస్తూ శ్రీ మోదీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“భారత క్రీడారంగం ఆనందోత్సాహాల్లో మునిగితేలాల్సిన ఘట్టమిది! ఆసియా క్రీడలు-2026 మహిళల హైజంప్‌ విభాగంలో పూజ కాంస్య పతకం సాధించినందుకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. ఆసియా క్రీడలలో రెండు దశాబ్దాల తర్వాత ఈ విభాగంలో భారత్‌కు లభించిన తొలి పతకమిది. ఇది నిజంగా చిరస్మరణీయ విజయం. భవిష్యత్తులోనూ ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ, ఆమెకు నా శుభాకాంక్షలు” అని ప్రధానమంత్రి పేర్కొన్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది.

***


(రిలీజ్ ఐడి: 2316834) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam