యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
వికసిత్ భారత్ అభియాన్ కోసం నషా ముక్త యువ కార్యక్రమంలో భాగంగా 400కు పైగా ప్రాంతాల్లో ‘మేరా స్వాస్థ్య, మేరా గర్వ్’ కార్యక్రమాలు
ఆరోగ్యం, వెల్‌నెస్, డీ అడిక్షన్ అవగాహన కార్యక్రమాల్లో 2.5 లక్షల మంది యువత, ప్రజలు
నాడు పోస్టు చేయడమైనది:
27 SEP 2026 9:08PM by PIB Hyderabad
వికసిత్ భారత్ అభియాన్ కోసం నషా ముక్త యువ కార్యక్రమంలో భాగంగా ‘మేరా స్వాస్థ్య, మేరా గర్వ్’ కార్యక్రమాలను మై భారత్, దాని భాగస్వామ్య సంస్థలు చేపట్టాయి. దేశవ్యాప్తంగా 400కు పైగా ప్రాంతాల్లో వీటిని నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో 2.5 లక్షల మందికి పైగా యువత, ప్రజలు పాల్గొన్నారు.
యువతలో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంతో పాటు మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల ఎదురయ్యే ప్రభావాలపై అవగాహనను బలోపేతం చేయడంపై ఈ జాతీయ స్థాయి కార్యక్రమం దృష్టి సారించింది. తద్వారా, ఆరోగ్య కార్యక్రమాల్లో పాల్గొనడానికి, ఆరోగ్యకరమైన, సానుకూల జీవన శైలి విధానాలను అనుసరించడానికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలుసుకొనే అవకాశాన్ని అందించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ఆయా ప్రదేశాల్లో ఆరోగ్య శిబిరాలు, ఆరోగ్య నిపుణులతో సదస్సులు, మెడిటేషన్ కార్యక్రమాలను నిర్వహించారు. శారీరక దారుఢ్యానికి మరింత ప్రాధాన్యమిచ్చేలా ఆరోగ్య కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు యువతను ప్రోత్సహించాయి. ఆరోగ్య నిపుణులతో సంభాషించే, నివారణ ఆరోగ్యం, అవగాహనతో కూడిన నిర్ణయాలకు ఉన్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకొనే అవకాశాన్ని నిపుణుల సదస్సులు అందించాయి.
దైనందిన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించేలా, సానుకూల ధోరణులను పెంపొందించుకొనేలా ప్రోత్సహించేందుకు ధ్యానం, వెల్‌నెస్ కార్యక్రమాలు మరింత తోడ్పడ్డాయి.
నషా ముక్త యువ ప్రతిజ్ఞలో పాల్గొన్నవారు ఆరోగ్యకరమైన, వ్యసన రహిత జీవనశైలిని కొనసాగించడానికి తమ నిబద్ధతను ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు తెలియజేశారు. నషా ముక్త సమాజం కోసం చేపడుతున్న విస్తృత కార్యక్రమంలో యువత సమష్టి భాగస్వామ్యాన్ని ఈ ప్రతిజ్ఞ ప్రతిబింబిస్తుంది.
అవగాహన, నివారణ, ఆరోగ్యకరమైన జీవనశైలి, సానుకూల సామాజిక తోడ్పాటు ద్వారా యువత నిరంతర భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే వికసిత్ భారత్ కోసం నషా ముక్త అభియాన్ లక్ష్యం. నషా ముక్త యువ ఉద్యమంలో ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని సమగ్ర భాగంగా మార్చాలనే లక్ష్యాన్ని ‘మేరా స్వాస్థ్య, మేరా గర్వ్’ కార్యకలాపాలు బలోపేతం చేస్తున్నాయి.
యువత, పౌరులు, భాగస్వామ్య సంస్థల చురుకైన భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది. ఆరోగ్యకరమైన, వ్యసన రహిత సమాజాన్ని నిర్మించడానికి శారీరక ఆరోగ్యం, మానసిక శ్రేయస్సు, అవగాహనతో కూడిన నిర్ణయాలు ప్రధాన ఆధారాలు అనే సందేశాన్ని ఇది బలోపేతం చేస్తుంది.
(రిలీజ్ ఐడి: 2315982)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2