ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా క్రీడల్లో పురుషుల షాట్ పుట్ పోటీలో రజత పతకం సాధించిన తేజిందర్‌పాల్ సింగ్‌ను అభినందించిన ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 26 SEP 2026 7:55PM by PIB Hyderabad

ఆసియా క్రీడల్లో పురుషుల షాట్ పుట్ పోటీలో అద్భుతమైన త్రోతో రజత పతకం సాధించిన తేజిందర్‌పాల్ సింగ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.

తేజిందర్‌పాల్ తన ఏకాగ్రత, పట్టుదలతో నిలకడగా దేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. అతని అసాధారణ ప్రయాణంలో ఆసియా క్రీడల మరో పతకం చేరడం సముచితమైన విషయమన్న శ్రీ నరేంద్ర మోదీ.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:

"తేజిందర్‌పాల్ సింగ్‌ నుంచి అద్భుతమైన ప్రదర్శన! ఆసియా క్రీడల్లో ఆకట్టుకునే త్రోతో పురుషుల షాట్ పుట్ పోటీలో రజత పతకం సాధించినందుకు అతనికి హృదయపూర్వక అభినందనలు.

తేజిందర్‌పాల్ తన ఏకాగ్రత, పట్టుదలతో నిలకడగా దేశానికి కీర్తి తెస్తున్నారు. అతని అసాధారణ ప్రయాణంలో ఆసియా క్రీడల పతకం మరో గొప్ప ఘట్టం. అతను భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ"


(రిలీజ్ ఐడి: 2315814) సందర్శకుల సూచీ సంఖ్య : : 12