రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గుంటూరు, నంబూరు మధ్య రూ. 108 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 4 లేన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన


లెవెల్ క్రాసింగ్ గేట్ నెం. 3ను తొలగించి గుంటూరు నగరానికి అవాంతరాలు లేని రైలు-రోడ్డు అనుసంధానాన్ని అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం

“భద్రతే భారతీయ రైల్వేకు అత్యున్నత ప్రాధాన్యం, లెవెల్ క్రాసింగ్‌ల తొలగింపు... ఆధునిక మౌలిక సదుపాయాలకు మార్గాన్ని సుగమం చేస్తోంది” – రైల్వే, జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ వీ సోమన్న

‘‘ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరించడానికి, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది’’ – గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్

నాడు పోస్టు చేయడమైనది: 26 SEP 2026 3:30PM by PIB Hyderabad

 

అంతకు ముందు విశిష్ట అతిథులకు దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సందీప్ మాథుర్ స్వాగతం పలికారు. ఈ జోన్‌ పరిధిలో భారతీయ రైల్వేలు చేపడుతున్న అభివృద్ధి, భద్రతా పనుల గురించి వివరించారు. గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీమతి సుధేష్ణ సేన్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.  

 

 

 

 

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ, పొన్నూరు శాసనసభ్యులు శ్రీ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, ఈస్ట్ గుంటూరు ఎంఎల్ఏ శ్రీ మహమ్మద్ నజీర్, వెస్ట్ గుంటూరు ఎంఎల్ఏ శ్రీమతి గల్లా మాధవి, ప్రత్తిపాడు ఎంఎల్ఏ, మాజీ ఐఏఎస్ అధికారి శ్రీ బీఆర్ రామాంజనేయులు పాల్గొన్నారు. రైల్వే ఉన్నతాధికారులు, గుంటూరు పౌరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

 

ఈ ప్రాజెక్టు విశేషాలు:

 

· ప్రాజెక్టు: ఎల్‌సీ గేట్ నెం.3 స్థానంలో నాలుగు లేన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం

 

· ప్రదేశం: గుంటూరు-నంబూరు (గుంటూరు-కృష్ణా కెనాల్ సెక్షన్), ఇన్నర్ రింగ్ రోడ్డును, గోరంట్ల గ్రామాన్ని, బస్ స్టాండ్ రోడ్డును అనుసంధానిస్తుంది.

 

· అంచనా వ్యయం: రూ.108 కోట్లు (100 శాతం నిధులను రైల్వే సమకూరుస్తుంది)

 

· పొడవు: 668 మీటర్లు

 

· అవసరమైన భూమి: 2.9 ఎకరాలు

 

· ప్రయోజనాలు: గేట్ల వద్ద ఆలస్యం తొలగింపు, నగరంలో మెరుగైన వాహన రాకపోకల నిర్వహణ, ఇంధన ఆదా, మెరుగయ్యే రైళ్ల సమయపాలన, పట్టణ భద్రత పెంపు

 

****


(రిలీజ్ ఐడి: 2315370) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil , Kannada