బొగ్గు మంత్రిత్వ శాఖ
ఇండియా మైనింగ్ వీక్-2026 కోసం మీడియా రిజిస్ట్రేషన్ ప్రారంభం
భారత ప్రతిష్ఠాత్మక మైనింగ్, మినరల్స్ ఈవెంట్ కవరేజ్ కోసం జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులకు ఆహ్వానం
నాడు పోస్టు చేయడమైనది:
25 SEP 2026 5:31PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్ వేదికగా నవంబరు 15 నుంచి 17 వరకు జరగనున్న ప్రతిష్టాత్మక ఇండియా మైనింగ్ వీక్ - 2026 కవరేజీ కోసం మీడియా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు అంతర్జాతీయ స్థాయిలో జరగబోయే ఈ మెగా ఈవెంట్‌ను కవర్ చేయాలనుకునే జర్నలిస్టులు, మీడియా నిపుణులు, కంటెంట్ క్రియేటర్లు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని నిర్వాహకులు ప్రకటించారు.
"బలమైన వనరులు, స్మార్ట్ మైనింగ్, సుస్థిర భవిష్యత్తు" అనే థీమ్‌తో ఈ మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు జరగనుంది. సాంకేతికంగా అభివృద్ధి చెందిన, ప్రపంచస్థాయి పోటీని తట్టుకోగల, పర్యావరణానికి హితమైన మైనింగ్ రంగాన్ని నిర్మించాలనే భారత దార్శనికతను ప్రతిబింబించేలా ఈ థీమ్‌ను ఎంచుకున్నారు. మైనింగ్, ఖనిజాల రంగంలో వస్తున్న మార్పులపై చర్చించేందుకు ఈ సదస్సు ఒక వేదికగా నిలవనుంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విధాన నిర్ణేతలు, ప్రతినిధులు, మైనింగ్-ఖనిజాల కంపెనీలు, పెట్టుబడిదారులు, సాంకేతిక ఆవిష్కర్తలు, మైనింగ్ పరికరాల తయారీదారులు, పరిశోధకులు, అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొని ప్రసంగించనున్నారు.
ఈ సదస్సులో ఉన్నత స్థాయి సమావేశాలు, అంతర్జాతీయ ప్రదర్శనలు, సాంకేతిక చర్చలు, పరిశ్రమ ప్రముఖుల చర్చలు, ప్రత్యేక నెట్‌వర్కింగ్ అవకాశాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మైనింగ్ రంగం భవిష్యత్తు ఎలా ఉండాలనే దానిపై ప్రధానంగా చర్చిస్తారు. ఇందులో ముఖ్యంగా ఖనిజ భద్రత, కొత్త ఖనిజాల అన్వేషణ, డిజిటలైజేషన్, ఆటోమేషన్, గనుల రక్షణ, పర్యావరణ పరిరక్షణ, అత్యంత కీలకమైన ఖనిజాలు, వనరుల సద్వినియోగం, సరికొత్త ఆవిష్కరణలపై దృష్టి సారించనున్నారు. భారత మైనింగ్ వ్యవస్థ భవిష్యత్తు, ప్రపంచవ్యాప్తంగా ఖనిజ రంగంలో వస్తున్న మార్పులపై సమగ్రంగా చర్చించడానికి ఈ కార్యక్రమం ఒక అద్భుతమైన వేదికగా నిలవనుంది.
భారత మైనింగ్ వీక్ అధికారిక వెబ్‌సైట్- https://www.indiaminingweek.org/media-registration/ ద్వారా మీడియా ప్రతినిధులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
****
(రిలీజ్ ఐడి: 2315119)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7