వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఆంధ్రప్రదేశ్‌లోని ఎఫ్‌సీవీ పొగాకు రైతుల కోసం బార్న్‌కు రూ. 50,000 చొప్పున వడ్డీ లేని ఏకకాల రుణం మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం
నాడు పోస్టు చేయడమైనది:
25 SEP 2026 6:12PM by PIB Hyderabad
మారుతోన్న ప్రపంచ మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు సకాలంలో ఆర్థిక సహాయం అందించేందుకు 'వడ్డీ లేని నిర్వహణ మూలధన సహాయ పథకం' కింద ఆంధ్రప్రదేశ్‌లోని ఎఫ్‌సీవీ పొగాకు రైతులకు ఒక్కో బార్న్‌కు రూ. 50,000 చొప్పున ఏకకాల వడ్డీ లేని రుణాన్ని ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో 2025–26 పంట సీజన్‌కు సంబంధించిన వేలాలు 2026 మార్చి 25న ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు సుమారు 100 మిలియన్ కిలోల ఫ్లూ-క్యూర్డ్ వర్జీనియా (ఎఫ్‌సీవీ) పొగాకు వేలమైంది. ఎఫ్‌సీవీ పొగాకును ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో సాగు చేస్తారు.
ప్రపంచ పొగాకు మార్కెట్‌లో డిమాండ్ సరళిలో మార్పులు, భౌగోళిక రాజకీయ పరిణామాలు, మారుతున్న అంతర్జాతీయ వాణిజ్య స్థితిగతులు కొనుగోలు, మార్కెటింగ్ పరిస్థితులను ప్రభావితం చేశాయి. కొనుగోళ్లను సులభతరం చేయడానికి, మార్కెట్ భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి, ఎగుమతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం సమన్వయ చర్యలు కూడా చేపడుతోంది. పంటను సజావుగా మార్కెటింగ్ చేయడానికి, ఎఫ్‌సీవీ పొగాకు రంగాన్ని బలోపేతం చేయడానికి ఎగుమతిదారులు, కొనుగోలుదారులు, రైతులు, ఇతర భాగస్వాములతో నిరంతరం సంప్రదింపులు చేపడుతోంది.
ప్రతిపాదించిన ఏకకాల ఆర్థిక సహాయంలో భాగంగా ఎఫ్‌సీవీ పొగాకు రైతులకు ఒక్కో బార్న్‌కు రూ. 50,000 చొప్పున వడ్డీ లేని నిర్వహణ మూలధన సహాయాన్ని ప్రభుత్వం ఆమోదించింది. ఈ ప్రతిపాదన దాదాపు 44,000 మంది రైతులకు వర్తిస్తుంది. దీనికోసం దాదాపు రూ. 220 కోట్ల ఆర్థిక సహాయం అందించనున్నారు. డీబీటీ ద్వారా నేరుగా రైతులకు ఈ ఆర్థిక సహాయం అందించనున్నారు.
రైతులకు తక్షణ ద్రవ్య లభ్యతను అందించటం, వారి కుటుంబ అవసరాలను తీర్చుకోవడానికి- సంస్థాగత రుణాలను తిరిగి చెల్లించడానికి వీలు కల్పించడం, వచ్చే పంట సీజన్ కోసం ఇన్‌పుట్‌లను కొనుగోలు చేయడం, ప్రైవేట్ అప్పులపై ఆధారపడటాన్ని తగ్గించాలనే ప్రధాన ఉద్దేశంతో ఆర్థిక సహాయం చేయనున్నారు. ఎఫ్‌సీవీ పొగాకు రైతులకు సకాలంలో ఆర్థిక సహాయం అందించడం ద్వారా, వారి కార్యకలాపాలకు అవసరమైన నిధులను సమకూర్చడం ద్వారా రైతుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఇది మరోసారి పునరుద్ఘాటిస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2315100)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11