ఆయుష్
azadi ka amrit mahotsav

స్పెషల్ క్యాంపెయిన్ 6.0 ద్వారా 3,100కు పైగా ప్రజా సమస్యలు పరిష్కరించిన ఆయుష్ మంత్రిత్వశాఖ

నాడు పోస్టు చేయడమైనది: 25 SEP 2026 4:40PM by PIB Hyderabad

ఆయుష్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నవంబర్ 2025 నుంచి ఆగస్టు 2026 వరకు నిర్వహించిన స్పెషల్ క్యాంపెయిన్ 6.0 కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమం ద్వారా పౌర కేంద్రితమైన సమర్థ పాలన, సకాలంలో ఫిర్యాదుల పరిష్కారం పట్ల తన నిబద్ధతను మంత్రిత్వశాఖ పునరుద్ఘాటించింది. పెండింగ్‌లో ఉన్న సిఫార్సుల పరిష్కారాన్ని వేగవంతం చేయడంపైనా... మంత్రిత్వ శాఖ, దాని సంస్థల వ్యాప్తంగా సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేయడంపైనా ఈ ప్రచారం ప్రధానంగా దృష్టి సారించింది.

ప్రచార కాలంలో 3,134 ప్రజా ఫిర్యాదుల్లో 3,100 ఫిర్యాదులను పరిష్కరించిన మంత్రిత్వ శాఖ... దాదాపు 99 శాతం పరిష్కార రేటును సాధించింది. 461 ప్రజా ఫిర్యాదుల అప్పీళ్లలో 454 అప్పీళ్లను పరిష్కరించి, పౌరుల సమస్యలను సకాలంలో, చురుగ్గా పరిష్కరించడం పట్ల తన నిబద్ధతను చాటింది.

ప్రభుత్వ సిఫార్సుల పరిష్కారం విషయంలోనూ మంత్రిత్వశాఖ గణనీయ పురోగతిని సాధించింది. పార్లమెంటు సభ్యుల మొత్తం 70 సిఫార్సులు, 18 పార్లమెంటరీ హామీలు, 14 పీఎంవో సిఫార్సులు, 3 రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సులను ప్రచారంలో భాగంగా మంత్రిత్వశాఖ విజయవంతంగా పరిష్కరించింది.

ప్రత్యేక ప్రచారం 6.0లో భాగంగా చేపట్టిన ప్రత్యేక చర్యలు... ప్రజలకు వేగంగా సేవలందించడం, సంస్థాగత జవాబుదారీతనం, సమర్థ పాలన పట్ల మంత్రిత్వశాఖ నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయి. ఈ ప్రచారం ద్వారా అంతర్గత విధులను మరింత బలోపేతం చేయడంతో పాటు, సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అంశాలను అత్యంత వేగంగా పరిష్కరించే అవకాశం లభించింది.

మంత్రిత్వశాఖ, దాని అనుబంధ సంస్థల నిరంతర పర్యవేక్షణ, సమన్వయ ప్రయత్నాల వల్ల ఈ ప్రత్యేక ప్రచారం 6.0 కార్యక్రమం... ప్రజా ఫిర్యాదులు, ప్రభుత్వ సిఫార్సులను సకాలంలో పరిష్కరించే వ్యవస్థను మరింత బలోపేతం చేసింది. పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన, ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిచ్చే పాలన అందించడంలో 'ఆయుష్ మంత్రిత్వశాఖ' నిబద్ధతను ఈ కార్యక్రమం స్పష్టం చేస్తోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2314988) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी