రైల్వే మంత్రిత్వ శాఖ
వీరాంగన లక్ష్మీబాయి ఝాన్సీ- ఆగ్రా కంటోన్మెంట్ ఎక్స్‌ప్రెస్‌ను మధుర వరకు పొడిగించేందుకు భారతీయ రైల్వే ఆమోదం
రాజాకీ మండి, రన్‌కూట, దీన్ దయాల్ ధామ్, బాద్ స్టేషన్లకు వాణిజ్య స్టాపులు
నాడు పోస్టు చేయడమైనది:
25 SEP 2026 12:04PM by PIB Hyderabad
రైలు నెం.11901/11902 వీరాంగన లక్ష్మీబాయి ఝాన్సీ- ఆగ్రా కంటోన్మెంట్ ఎక్స్‌ప్రెస్‌ను మధుర స్టేషన్ వరకు పొడిగించడానికి భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. దీనివల్ల వీరాంగన లక్ష్మీబాయి ఝాన్సీ, మధుర మధ్య మరో రైలు సర్వీసు అందుబాటులోకి వస్తుంది. ఫలితంగా ఝాన్సీ, ఆగ్రా, మధుర మధ్య ప్రయాణించే వారికి మరింత ప్రయాణ సౌలభ్యం కలుగుతుంది.
ఈ ఆమోదం లభించడంతో రైలు నెం. 11901 ఇప్పుడు వీరాంగన లక్ష్మీబాయి ఝాన్సీ నుంచి మధుర వరకు నడుస్తుంది. అలాగే రైలు నెం.11902 తిరుగు ప్రయాణం కోసం మధుర నుంచి బయలుదేరి వీరాంగన లక్ష్మీబాయి ఝాన్సీకి చేరుకుంటుంది. రైలును మధుర వరకు పొడిగించడంతో మొత్తం ప్రయాణ దూరం 217 కి.మీ. నుంచి 270 కి.మీ.కు పెరుగుతుంది.
రైలు నెం.11901 వీరాంగన లక్ష్మీబాయి ఝాన్సీ నుంచి 16:00 గంటలకు బయలుదేరి 23:00 గంటలకు మధుర చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నెం.11902 మధుర నుంచి 05:05 గంటలకు బయలుదేరి 12:50 గంటలకు వీరాంగన లక్ష్మీబాయి ఝాన్సీ చేరుకుంటుంది.
పొడిగించిన రైలు సర్వీసులో భాగంగా రాజా కీ మండి, రన్‌కూట, దీన్ దయాళ్ ధామ్, బాద్ స్టేషన్లకు వాణిజ్య స్టాపులు ఉన్నాయి. దీనివల్ల ఈ స్టేషన్లలో ప్రయాణికులకు ఈ రైలు సదుపాయం అందుబాటులోకి వస్తుంది.
ఈ పొడిగింపు ఝాన్సీ, ఆగ్రా, మధుర మధ్య ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని బలోపేతం చేయడంతో పాటు, విస్తరించిన మార్గంలోని మధ్యంతర స్టేషన్లకు అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2314843)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6