రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ద్వైపాక్షిక నావికాదళ విన్యాసాలు వరుణ 24వ ఎడిషన్ కోసం ఫ్రాన్స్‌లోని టౌలాన్‌కు చేరుకున్న ఐఎన్ఎస్ త్రిశూల్

నాడు పోస్టు చేయడమైనది: 24 SEP 2026 2:36PM by PIB Hyderabad

సెప్టెంబర్ 22, 2026న ఐఎన్ఎస్ త్రిశూల్ ఫ్రాన్స్‌లోని టౌలాన్‌కు చేరుకుంది. భారత్, ఫ్రాన్స్ నౌకాదళాల మధ్య జరిగే వరుణ ద్వైపాక్షిక సముద్రయాన విన్యాసాల 24వ ఎడిషన్‌లో ఐఎన్ఎస్ త్రిశూల్ పాల్గొంటుంది.

వరుణ విన్యాసాల్లో భాగంగా నౌకాశ్రయంలో, సముద్రంలో క్రాస్ డెక్ సందర్శనలు, కార్యాచరణ పరస్పర చర్యలు, క్రీడాపరమైన కార్యకలాపాలు ఉంటాయి. అనుభవాలను, ఉత్తమ పద్ధతులను పంచుకునేందుకు, పరస్పర సహకారాన్ని మెరుగుపరచుకునేందుకు, పరస్పర అవగాహనను పెంపొందించుకునేందుకు రెండు నౌకాదళాలకు ఈ కార్యక్రమాలు అవకాశం కల్పిస్తాయి.

ఈ పర్యటన భారత్-ఫ్రాన్స్ దేశాల మధ్య బలమైన, శాశ్వతమైన సముద్రయాన సంబంధాలను తెలియజేస్తుంది. ఇరుదేశాల మధ్య విస్తరిస్తున్న సముద్రయాన సహకారాన్ని, బలపడుతున్న ద్వైపాక్షిక బంధాన్ని ప్రతిబింబిస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2314373) సందర్శకుల సూచీ సంఖ్య : : 22
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil