బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రత్యేక కార్యక్రమం 6: ఈ–వ్యర్థాలను తొలగించడం, స్క్రాప్ నిర్వహణ, పని ప్రదేశాల ఆధునీకరణే బొగ్గు మంత్రిత్వ శాఖ లక్ష్యం

నాడు పోస్టు చేయడమైనది: 24 SEP 2026 2:11PM by PIB Hyderabad

తన పరిధిలోని అన్ని పరిపాలనా కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)ల్లో ఈ–వ్యర్థాల క్రమబద్ధమైన సేకరణ, విభజన, శాస్త్రీయ పద్ధతిలో పారవేయడంపై దృష్టి సారిస్తూ... 2026 అక్టోబర్ 2 నుంచి 31 వరకు ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ సన్నద్ధమవుతోంది. పర్యావరణం పట్ల బాధ్యతనూ, వ్యర్థాలను సంపదగా మార్చాలనే జాతీయ లక్ష్యం పట్ల తన నిబద్ధతనూ చాటి చెబుతూ.. నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీనిలో కార్యాలయాల ఆధునీకరణకు, కార్యాలయ స్థలాలను సద్వినియోగం చేసుకోవడానికి, డిజిటలైజేషన్ను వేగవంతం చేయడానికి, స్క్రాప్ తొలగింపునకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ ప్రయత్నాల ద్వారా స్వచ్ఛమైన, సుస్థిరమైన, పౌర కేంద్రక పరిపాలనను పెంపొందించడం, విస్తృత సంస్థాగత వ్యవస్థలను బలోపేతం  చేయడమే మంత్రిత్వ శాఖ లక్ష్యం.

ప్రత్యేక క్యాంపెయిన్–6 సన్నాహక దశలో భాగంగా 23.09.2026న డీడీజీ శ్రీమతి చేతన శుక్లా, డీఎస్ శ్రీ రాబిన్ గాంగ్టే, ఇతర అధికారులు లోక్ నాయక్ భవన్‌లోని రికార్డుల గదిని సమీక్షించారు. దీనిలో భాగంగా ఫైళ్లను క్రమపద్ధతిలో వర్గీకరించడం, కాలం చెల్లిన లేదా అవసరం లేని రికార్డులను గుర్తించి వాటిని తొలగిచడంపై దృష్టి సారించారు. తద్వారా రికార్డుల నిర్వహణను క్రమబద్ధీకరించడం, అవి అందుబాటులో ఉండేలా చూడటం, ఖాళీ అయిన స్థలాన్ని ఉత్పాదకంగా వినియోగించుకొనేలా చేయడమే దీని లక్ష్యం. 

 

జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా, డబ్ల్యూసీఎల్ సంస్థ నాగపూర్‌లోని తన ప్రధాన కార్యాలయంలో ఈ–వ్యర్థాల నిర్వహణపై ఓ వీధినాటకాన్ని ప్రదర్శించింది. దీని ద్వారా ఈ–వ్యర్థాల బాధ్యతాయుత సేకరణ, విభజన, రీసైక్లింగ్, శాస్త్రీయ పద్ధతిలో పారవేయడంపై అవగాహన కల్పించారు.

 

తన పరిదిలోని సీపీఎస్‌ఈలు, సీసీవోలు, సీఎంపీఎఫ్‌వోలతో కలసి స్వచ్ఛతా కార్యక్రమాల కోసం ప్రదేశాలను గుర్తించడం, స్క్రాప్‌ను, పనికిరాని వస్తువులను తొలగించడం, పెండింగులో ఉన్న సిఫారసులు, ఫిర్యాదులు, అప్పీళ్లను పరిష్కరించడం, స్థలం, రికార్డుల నిర్వహణను క్రమబద్ధీకరించడం లాంటి పనులను మంత్రిత్వశాఖ చురుగ్గా చేపడుతోంది. ఈ కార్యక్రమాలు కార్యాచరణ సామర్థ్యాన్ని, పారదర్శకతను, సమర్థమైన వ్యర్థాల నిర్వహణను బలోపేతం చేస్తున్నాయి. సుస్థిర పరిపాలనా విధానాల పట్ల ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాయి. 

 

BEFORE

AFTER

2026 సెప్టెంబరు 24 నాటికి, ప్రత్యేక క్యాంపెయిన్–6 కోసం లక్ష్యాలను గుర్తించడంలో బొగ్గు మంత్రిత్వ శాఖ గణనీయమైన పురోగతిని సాధించింది:

  • శుభ్రం చేయడానికి గుర్తించిన ప్రదేశాలు: 1462

  • ఖాళీ చేయాల్సిన స్థలాలు: 1.21 కోట్ల చ.అ.

  • పారవేయాల్సిన స్క్రాప్ పరిమాణం: 10,713 మెట్రిక్ టన్నులు

  • సమీక్షించాల్సిన భౌతిక ఫైళ్లు: 10,189

  • సమీక్షించాల్సిన ఈ–ఫైళ్లు: 75,382

2026 సెప్టెంబర్ 30 వరకు సన్నాహక దశ కొనసాగుతుంది. కాబట్టి ఈ సంఖ్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రత్యేక క్యాంపెయిన్–6 ద్వారా మెరుగైన పరిశుభ్రత, క్రమబద్ధమైన రికార్డుల నిర్వహణ, పరిపాలనా సామర్థ్యాన్ని సాధించాలనే కృతనిశ్చయంతో బొగ్గు మంత్రిత్వ శాఖ ఉంది. 

 

***


(రిలీజ్ ఐడి: 2314371) సందర్శకుల సూచీ సంఖ్య : : 17
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil