ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తరప్రదేశ్.. గ్రేటర్ నోయిడా బస్సులో మంటలు.. ప్రాణనష్టం
సంతాపం తెలిపిన ప్రధానమంత్రి… పీఎమ్ఎన్‌ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
24 SEP 2026 11:14AM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్.. గ్రేటర్ నోయిడాలో ఓ బస్సులో మంటలు చెలరేగి ప్రాణనష్టం జరిగిందని తెలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు విచారాన్ని వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ప్రార్థించారు.
ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎమ్ఎన్‌ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియాను ప్రధానమంత్రి ప్రకటించారు. గాయపడ్డ వారికి రూ.50,000 చొప్పున అందిస్తారని తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:
‘‘ఉత్తరప్రదేశ్.. గ్రేటర్ నోయిడాలో ఓ బస్సులో మంటలు చెలరేగి ప్రాణనష్టం కలిగిందని తెలిసి చింతించాను. ప్రాణాలు కోల్పోయిన వారికి నేను సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎమ్ఎన్‌ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియాను అందిస్తారు. గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఇస్తారు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ’’.
***
(రిలీజ్ ఐడి: 2314343)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam