ప్రధాన మంత్రి కార్యాలయం
పునర్వినియోగించేందుకు వీలుగా, పోటీతత్వాన్ని పెంపొందించే జౌళి రంగాన్ని తీర్చిదిద్దటానికి చేపడుతున్న కార్యక్రమాలను ప్రతిబింబించే కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
19 SEP 2026 4:13PM by PIB Hyderabad
కేంద్ర మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ రాసిన ఒక కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. జౌళి పరిశ్రమ వ్యర్థాల పునర్వినియోగం, పర్యావరణహిత ఉత్పత్తి విధానాలు, గ్రీన్ టెక్నాలజీ వంటి కార్యక్రమాలు వస్త్ర రంగాన్ని పునర్వినియోగానికి అనువుగా, అంతర్జాతీయంగా పోటీపడేలా తీర్చిదిద్దుతున్న తీరుని ఈ కథనం వివరిస్తుంది. భారత జీవన విధానంలో సుస్థిరత భాగమని, ఇప్పుడది మన జౌళి రంగానికి సరికొత్త భవిష్యత్తును అందిస్తోందని పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
చాలా కాలంగా భారత జీవన విధానంలో సుస్థిరత అంతర్భాగం. ఇప్పుడది మన జౌళి రంగానికి సరికొత్త భవిష్యత్తును అందిస్తోంది.
వస్త్ర వ్యర్థాల పునర్వినియోగం, పర్యావరణహిత ఉత్పత్తి విధానాలు, గ్రీన్ టెక్నాలజీ వంటి కార్యక్రమాలు మన జౌళి రంగాన్ని పునర్వినియోగానికి అనువుగా, పోటీతత్వంతో కూడినదిగా తీర్చిదిద్దటంలో తోడ్పడుతున్న తీరుని కేంద్రమంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ ఈ కథనంలో వివరించారు.
***
(రిలీజ్ ఐడి: 2312445)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam