ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పుట్టినరోజు శుభాకాంక్షలు, ఆప్యాయత, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 17 SEP 2026 10:40PM by PIB Hyderabad

తన పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజల నుంచి అందిన శుభాకాంక్షలు, ఆప్యాయత, ఆశీస్సులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల నుంచి ఆప్యాయతతో వచ్చిన ప్రతీమాటా ఎంతో విలువైనదని, ప్రజలకు సేవ చేయటానికి నూతనోత్సాహాన్ని, బలాన్ని ఇస్తుందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా రోజంతా సేవా కార్యకలాపాల్లో నిమగ్నమైన ప్రతీ ఒక్కరినీ ఆయన అభినందించారు. వికసిత్ భారత్ నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా ప్రజలు అందించిన శుభాకాంక్షలు, ఆప్యాయత, ఆశీస్సులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

ప్రతి ఒక్కరి ఆప్యాయమైన మాట నాకు ఎంతో విలువైనది. ఇది ప్రజలకు సేవ చేసేందుకు మరింత నూతనోత్తేజాన్ని ఇస్తుంది.

ఈ రోజంతా సేవా కార్యకలాపాల్లో నిమగ్నమైన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నా.

మనమందరం కలిసి వికసిత్ భారత్ నిర్మాణాన్ని కొనసాగిద్దాం.


(రిలీజ్ ఐడి: 2311953) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Assamese , Punjabi , Gujarati , Kannada , Malayalam