రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డులో భారత నౌకాదళం కోసం నెక్ట్స్ జనరేషన్ మిస్సైల్ వెసెల్ (ఎన్‌జీఎంవీ) రెండో నౌక నిర్మాణం ప్రారంభం

నాడు పోస్టు చేయడమైనది: 18 SEP 2026 10:41AM by PIB Hyderabad

కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (సీఎస్ఎల్)లో 2026 సెప్టెంబర్ 17న నెక్ట్స్ జనరేషన్ మిస్సైల్ వెసెల్ (ఎన్‌జీఎంవీ) ప్రాజెక్టు రెండో నౌక నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. యుద్ధ నౌకల తయారీ, సేకరణ అసిస్టెంట్ కంట్రోలర్ అయిన రియర్ అడ్మిరల్ కపిల్ మెహతా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భారత నౌకాదళం, సీఎఎస్ఎల్‌కు చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

2023 మార్చిలో ఎన్‌జీఎంవీల నిర్మాణానికి సంబంధించిన ఒప్పందం కుదిరింది. అత్యాధునిక ఆయుధాలను, సెన్సార్లను ఎన్‌జీఎంవీల్లో ఏర్పాటు చేస్తారు. ఇవి భవిష్యత్తుకు, పోరాటానికి సిద్ధంగా ఉన్న బలగాలుగా భారతీయ నౌకాదళం సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపరుస్తాయి. క్లిష్టమైన హిందూ మహాసముద్ర ప్రాంతంలో పనిచేయగల బలమైన, ఆధునికమైన నౌకాదళాన్ని సిద్ధం చేయడంలో భారత్ నిబద్ధతను ఈ నౌకల నిర్మాణం బలోపేతం చేస్తుంది.

కీలకమైన పరికరాలన్నింటినీ దేశీయంగా అభివృద్ధి చేసి, తయారు చేశారు. ఇది దేశ సామర్థ్యాన్ని తెలియజేస్తూ... ఆత్మనిర్భర భారత్, మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ లాంటి భారత ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలకు అనుగుణంగా ఉంది.

 


(రిలీజ్ ఐడి: 2311947) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Malayalam