గనుల మంత్రిత్వ శాఖ
స్పెషల్ క్యాంపెయిన్ 5.0 విజయం స్ఫూర్తితో స్పెషల్ క్యాంపెయిన్ 6.0 కింద
ఈ-వేస్ట్ నిర్వహణను మరింత బలోపేతం చేస్తోన్న గనుల మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
16 SEP 2026 5:07PM by PIB Hyderabad
2026 అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు స్పెషల్ క్యాంపెయిన్ 6.0ను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్పెషల్ క్యాంపెయిన్ 5.0 సాధించిన విజయాల స్ఫూర్తితో స్వచ్ఛత, సుస్థిరత, బాధ్యాయుతమైన వనరుల నిర్వహణపై ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా ‘ఈ-వేస్ట్ సేకరణ, వేరుచేయడం, సమర్థవంతమైన పారవేయటం’ అనే ప్రధానాంశంతో ఈ సంవత్సరం గనుల మంత్రిత్వ శాఖ ప్రత్యేక క్యాంపెయిన్ 6.0 కోసం సన్నాహాలు చేస్తోంది.
స్పెషల్ క్యాంపెయిన్ 5.0 విజయం.. తదనంతరం 2025 నవంబర్ నుంచి 2026 ఆగస్టు వరకు చేసిన నిరంతర ప్రయత్నాల ఆధారంగా మంత్రిత్వ శాఖ, దాని క్షేత్రస్థాయి సంస్థలు పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో, ప్రభుత్వ వనరుల సరైన వినియోగాన్ని నిర్ధారించడంలో గణనీయమైన పురోగతిని సాధించాయి.
ఈ కాలంలో మొత్తం 1,772 ప్రజా ఫిర్యాదులను పరిష్కరించారు. 3,751 భౌతిక ఫైళ్లను తొలగించారు. ఇది రికార్డుల నిర్వహణను మెరుగుపరచడానికి, క్రమబద్ధమైన పరిపాలనా ప్రక్రియలకు దోహదపడింది. ఈ క్యాంపెయిన్ ఫలితంగా 1.7 లక్షల చదరపు అడుగులకు పైగా కార్యాలయ స్థలం ఖాళీ అయింది. తద్వారా ప్రభుత్వ ప్రాంగణాలను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి వీలైంది. మంత్రిత్వ శాఖ, దాని సంస్థలలో 116 కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో వ్యర్థాల విక్రయం ద్వారా సుమారు రూ. 19.33 కోట్ల ఆదాయం సమకూరింది.
స్పెషల్ క్యాంపెయిన్ 6.0 లో భాగంగా సెప్టెంబర్ 15 నుంచి 30 వరకు జరిగే సన్నాహక దశలో ఎంపీలు, పీఎంఓ, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెండింగ్‌లో ఉన్న రిఫరెన్స్‌లు, ప్రజా ఫిర్యాదులు, అప్పీళ్లు, పార్లమెంటరీ హామీల పరిష్కారం కోసం లక్ష్యాలను గుర్తించడం, నిర్దేశించడంపై దృష్టి పెడతారు. అలాగే రికార్డుల సమీక్ష, నిర్వహణ కూడా ఇందులో ఉంటుంది.
అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు స్పెషల్ క్యాంపెయిన్ 6.0ను అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా గనుల మంత్రిత్వ శాఖ, దాని అనుబంధ- కింది స్థాయి కార్యాలయాలు, సీపీఎస్ఈలు, స్వయంప్రతిపత్తి గల సంస్థల సమన్వయ ప్రయత్నాల ద్వారా గుర్తించిన లక్ష్యాలను సాధించడంపై దృష్టి పెడుతుంది.
ఈ ఏడాది ఇతివృత్తానికి అనుగుణంగా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్తి సంస్థ అయిన జేఎన్ఏఆర్‌డీడీసీని మంత్రిత్వ శాఖ నోడల్ ఏజెన్సీగా నామినేట్ చేసింది. ఇది ఎంఏఆర్ఐ సహకారంతో జీపీఓఏ వద్ద, గనుల మంత్రిత్వ శాఖకు చెందిన వివిధ కార్యాలయాలలో, ఈ-వేస్ట్ సేకరణ కోసం వివిధ రాష్ట్రాలు- ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-వేస్ట్ సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తుంది. జాతీయ కీలక ఖనిజాల మిషన్ (ఎన్‌సీఎంఎం) లక్ష్యాలకు అనుగుణంగా ఈ-వేస్ట్ నుంచి కీలక ఖనిజాలను రీసైక్లింగ్ చేయడానికి, రికవరీ చేయడానికి ఇది దోహదపడుతుంది.
స్పెషల్ క్యాంపెయిన్ 6.0 ద్వారా గనుల మంత్రిత్వ శాఖ స్వచ్ఛత, సుస్థిరత, సమర్థవంతమైన పాలన, బాధ్యాయుతమైన వనరుల నిర్వహణ దిశగా తన ప్రయత్నాలను మరింత బలోపేతం చేయనుంది. అలాగే సుస్థిరాభివృద్ధి అనే విస్తృత జాతీయ లక్ష్యానికి తన వంతు సహకారాన్ని అందిస్తుంది.
ప్రభుత్వ కార్యాలయాల్లో సమర్థవంతమైన పద్ధతులను క్రమబద్ధీకరించేందుకు, ఈ-వేస్ట్ వంటి వనరుల పర్యావరణ బాధ్యతాయుతమైన నిర్వహణను ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖ చేసే ప్రయత్నాలను ఈ క్యాంపెయిన్ మరింత బలపరుస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2311151)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7