రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ స్టేషన్ ఎండబ్ల్యూఓ సెమినార్-2026

నాడు పోస్టు చేయడమైనది: 15 SEP 2026 3:20PM by PIB Hyderabad

వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్‌లో సెప్టెంబర్ 14, 2026న స్టేషన్ మాస్టర్ వారెంట్ ఆఫీసర్ల (ఎండబ్ల్యూఓలకోసం సదస్సును నిర్వహించారుడబ్ల్యూఏసీ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ ఎయిర్ మార్షల్ జార్జ్ థామస్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు... కమాండ్ పరిధిలోని వివిధ స్టేషన్ల నుంచి ఎండబ్ల్యూఓలు హాజరయ్యారు.

ఉత్తమ విధానాలనుఆలోచనలను పంచుకునేందుకుమెరుగుపరచాల్సిన అంశాలపై చర్చించేందుకు ఇది ఉమ్మడి వేదికగా నిలిచిందిపనిచేసే వాతావరణాన్ని మెరుగుపరచటంసాధారణ సవాళ్లను పరిష్కరించటంఎయిర్ వారియర్లువారి కుటుంబాల సంక్షేమ కార్యక్రమాలను మరింత బలపరచటంపై ఈ చర్చలు దృష్టి సారించాయి.

వాయుసేన కేంద్రాల్లో సానుకూలఅనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయటంలో స్టేషన్ ఎండబ్ల్యూఓలు కీలకమని ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ స్పష్టం చేశారుసమర్థవంతమైన సమాచార మార్పిడినిదృఢమైన వృత్తి నైపుణ్యాన్నిసంక్షేమ దృక్పథాన్ని పెంపొందించటంలో వారు కీలక పాత్ర పోషిస్తారని చెప్పారుసిబ్బంది సంక్షేమంనిరంతర అభివృద్ధివృత్తిలో ఉత్తమ ప్రతిభ కనబరచటం పట్ల డబ్ల్యూఏసీ నిబద్ధతను ఈ సదస్సు మరోసారి చాటిచెప్పింది.

 

***


(రిలీజ్ ఐడి: 2310561) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi , Gujarati , Tamil