బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సంప్రదాయ విధానాల నుంచి స్మార్ట్ మైనింగ్ వరకు: కోల్ ఇండియా లిమిటెడ్ సాంకేతిక పరివర్తన

నాడు పోస్టు చేయడమైనది: 15 SEP 2026 11:20AM by PIB Hyderabad

భారతదేశ ఇంధన భద్రత, పారిశ్రామిక వృద్ధిలో బొగ్గు తవ్వకం ప్రధానాంశంగా ఉంది. సామర్థ్యాన్ని, భద్రతను, సుస్థిరతను పెంపొందించేందుకు భూగర్భ (యూజీ), ఓపెన్ కాస్ట్ (ఓసీ) కార్యకలాపాలు రెండింటినీ ఆధునికీకరించేలా సీఐఎల్ ఓ వ్యూహాత్మక మార్పును తీసుకువచ్చింది. సంప్రదాయ మైనింగ్ సాంకేతిక విధానాల నుంచి మరింత అధునాతన సాధనాలు, పద్ధతుల వైపు వేగంగా మారింది. ఐవోటీ, ఏఐ, డేటా ఎనలిటిక్స్ లాంటి అధునాతన డిజిటల్ విధానాలు... ప్రమాదాల ప్రభావాన్ని తగ్గిస్తున్నాయి. రికవరీ రేట్లను పెంచుతున్నాయి. అలాగే ముందస్తు నిర్వహణ, స్మార్ట్ కంట్రోల్ రూములు, ఆటోమేటెడ్ డిస్పాచ్, ‘స్మార్ట్ మైన్స్’ లాంటి వాటిని సాధ్యం చేస్తున్నాయి.

ప్రస్తుతం: అమల్లో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాలు

అన్వేషణ

ఇన్వేసివ్ (కోర్ డ్రిల్లింగ్), నాన్ ఇన్వేసివ్ 2డీ/3డీ సీస్మెక్ సర్వే ద్వారా వనరులను గుర్తిస్తున్నారు. దీనివల్ల బోర్‌హోల్స్‌ సంఖ్య 50 శాతానికి తగ్గుతుంది. అలాగే స్పెక్ట్రల్ ఎన్‌హాన్స్‌మెంట్ (ఎస్‌పీఈ) అస్సేయింగ్ ద్వారా వనరులను గుర్తించే సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. గామా రే, సాంద్రత, రెసిస్టివిటీ లాగ్‌ల ఆధారంగా బొగ్గు పొరలను విశ్లేషించడానికి మెషిన్ లెర్నింగ్ టెక్నిక్‌లను (ఎస్‌వీఎం, డెసిసన్ ట్రీ, ర్యాండమ్ ఫారెస్ట్, ఎంఎల్‌పీ, ఎక్స్‌జీబూస్ట్) ఉపయోగిస్తున్నారు. మైనింగ్‌కి ముందు, పూర్తయిన తర్వాత, ప్రతి దశలోనూ రిమోట్ సెన్సింగ్, జీఐఎస్, లైడార్, డ్రోన్లు, బాతిమెట్రిక్ సర్వేలను సీఎంపీడీఐ వినియోగిస్తోంది. గనుల పర్యవేక్షణ, పర్యావరణ మదింపు కోసం ఏఐ ఆధారిత శాటిలైట్ జియో స్పేసియల్ డ్యాష్ బోర్డును అభివృద్ధి చేసేందుకు ఎన్ఆర్ఎస్‌సీతో సీఐఎల్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

ఓపెన్–కాస్ట్ గనులు

పేలుడు రహిత మైనింగ్ కోసం అధిక సామర్థ్యం కలిగిన హెచ్ఈఎంఎంలను 2021 నుంచి సీఐఎల్ క్రమంగా వినియోగంలోకి తీసుకువస్తోంది. వీటిలో 42 క్యూబిక్ మీటర్ల షవల్స్, 240 టీఈ డంపర్లు, డ్రాగ్‌లైన్లు, సర్ఫేస్ మైనర్లు ఉన్నాయి. పేలుడు రహిత సాంకేతిక పరిజ్ఞానం దుమ్మును, శబ్దాన్ని, ప్రకంపనలను తగ్గిస్తుంది. అదే సమయంలో ఉత్పత్తి నాణ్యతను పెంచుతుంది. బొగ్గు వృథాను తగ్గిస్తుంది. 2024–25లో ఎలక్ట్రిక్ డిటోనేటర్ల వాడకాన్ని దశల వారీగా నిలిపివేసి, అత్యంత సురక్షితమైన ఎలక్ట్రానిక్ డిటోనేటర్లను ప్రవేశపెట్టారు. ఆపరేటర్ అలసటను గుర్తించడం, సమీప ప్రమాదాలపై హెచ్చరికలు ఇవ్వడం, 360 డిగ్రీల కెమెరాలు, స్వయంచాలితంగా అగ్ని ప్రమాదాలను గుర్తించడం/ఆర్పడం లాంటి ఏఐ ఆధారిత భద్రతా ఫీచర్లు ప్రధాన హెచ్ఈఎంఎంల్లో ఏర్పాటయ్యాయి. వీటికి ఏఐ సిమ్యులేటర్లు, వీఆర్ ట్రైనింగ్ మద్దతు ఇస్తాయి. జీపీఎస్ ఆధారిత ట్రక్ డిస్పాచ్/ఓఐటీడీఎస్, పేలోడ్ మానిటరింగ్ (పీఎల్ఎంఎస్), వెహికల్ హెల్త్ మానిటరింగ్ (వీహెచ్ఎంఎస్) డిజిటలైజేషన్ ద్వారా వినియోగ సామర్థ్యం మరింత మెరుగవుతుంది.

భూగర్భ గనులు

కంటిన్యుయస్ మైనర్, లాంగ్ వాల్, హైవాల్ టెక్నాలజీలను ఉపయోగించి యూజీ ఉత్పత్తిని సుమారుగా 100 మిలియన్ టన్నులకు పెంచేందుకు సీఐఎల్ కట్టుబడి ఉంది. ఇప్పటికే కంటిన్యుయస్ మైనింగ్ విధానం అమలవుతోంది. ఇప్పుడు లాంగ్‌వాల్ విధానం విస్తృత స్థాయిలో ప్రారంభమైంది. మెరుగైన వెంటిలేషన్, స్ట్రాటా నిర్వహణ, భద్రతను బలోపేతం చేయడంతో పాటుగా పిల్లర్లలో నిక్షిప్తమై ఉన్న అధిక నాణ్యత కలిగిన బొగ్గును వెలికితీయడానికి పేస్ట్ ఫిల్ సాంకేతిక పరిజ్ఞానాల్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

ప్రధాన మౌలిక సదుపాయాల అమలు

ఫస్ట్ మైల్ కనెక్టివిటీ (ఎఫ్ఎం‌సీ), ముఖ్యమైన రైల్వే మౌలిక వసతుల ద్వారా బొగ్గు తరలింపును సీఐఎల్ బలోపేతం చేస్తోంది. సీహెచ్‌పీలు, సైలోలు, కన్వేయర్లు, ర్యాపిడ్ లోడింగ్ వ్యవస్థలను ఏకీకృతం చేసే 92 ప్రణాళికాబద్ధమైన ఎఫ్ఎంసీ ప్రాజెక్టుల్లో 46 ప్రాజెక్టులు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇవి సుమారుగా 432 ఎంపీటీయే సామర్థ్యాన్ని సృష్టించాయి. దాదాపు రూ. 27,800 కోట్ల విలువైన ఈ కార్యక్రమం 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి 994 ఎంటీవై యాంత్రిక లోడింగ్ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. వీటికి తోడుగా, కీలకమైన ఏడు రైల్వే ప్రాజెక్టుల్లో (దాదాపు 23,465 కోట్లు) నాలుగు ప్రారంభమయ్యాయి. మిగిలిన వాటిని 2027–28 ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. గని లోపల రవాణా కోసం హెచ్ఈఎంఎం స్థానంలో హై-యాంగిల్/శాండ్‌విచ్ కన్వేయర్‌లను ఉపయోగిస్తున్నారు.

బొగ్గు శుద్ధి, పర్యావరణ నిర్వహణ

హెవీ మీడియా సైక్లోన్, హైడ్రో సైక్లోన్, టీటర్ బెడ్ సెపరేటర్, రిఫ్లక్స్ క్లాసిఫైయర్, జిగ్స్ వంటి ధాతు శుద్ధి సాంకేతికతలు సీఐఎల్ వాషరీలు అన్నింటిలోనూ పనిచేస్తున్నాయి. పర్యావరణం విషయానికి వస్తే.. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ, సమర్థమైన, ప్రకృతిహిత అనువర్తనాలపై నిరంతరాయంగా దృష్టి సారించడంలో సీఐఎల్ నిల్వలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. 

ఐటీ కార్యక్రమాలు, డిజిటల్ పరివర్తన

రెండు ప్రధానాంశాలపై సీఐఎల్ డిజిటల్ వ్యవస్థ ఆధారపడి ఉంది. సమీకృత కమాండ్ కంట్రోల్ సెంటర్లు (ఐసీసీసీ), వాహన ట్రాకింగ్, ఆర్ఎఫ్‌ఐడీ వ్యవస్థలు, వేబ్రిడ్జి ఆటోమేషన్, జీపీఎస్ వాహన పర్యవేక్షణ, ఏడు గనుల్లో డిజికోల్ పైలట్‌ను ఆపరేషనల్ టెక్నాలజీ (ఓటీ)లో సీఐఎల్ అమలు చేస్తోంది. 

ఎంటర్‌ప్రైజ్ ఐటీలో ఎస్ఏపీ/4హెచ్ఏఎన్ఏ, ఈ–ఆఫీస్, క్లౌడ్ మౌలికవసతులు, డేటా ఎనలిటిక్స్‌ను సీఐఎల్ అమలు చేసింది. వీటి ద్వారా కొనుగోళ్లు, నిల్వలు, ఆర్థిక వ్యవహారాలు, మానవ వనరుల ప్రక్రియలను సమగ్రపరచడంతో పాటు, కాగిత రహిత ఫైళ్ల నిర్వహణకు మార్గం సుగమమైంది. అలాగే, వేగవంతమైన, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మెరుగుపడింది. 

భవిష్యత్తు: తెలివైన, హరిత మైనింగ్‌కు ప్రణాళిక 

అత్యాధునిక మైనింగ్

తెలివైన, స్వతంత్రమైన, తక్కువ కర్బన ఉద్గారాలున్న మైనింగ్ దిశగా తర్వాతి దశ ముందుకు వెళుతోంది. 190 టన్నులకు పైగా సామర్థ్యం ఉన్న డీజిల్ ఎలక్ట్రిక్ డంపర్ల కోసం ఎలక్ట్రిక్ మొబిలిటీ, ట్రాలీ అసిస్ట్ సాంకేతిక పరిజ్ఞానాలను ప్రవేశపెట్టేందుకు రిమోట్ ఆధారిత లైన్–ఆఫ్–సైట్ డోజర్లను (ఒక్కో యంత్రం ఖరీదు సుమారు రూ. 2 కోట్లు) ఎస్ఈసీఎల్, ఎన్సీఎల్ సంస్థల్లో పరీక్షిస్తున్నారు. శిలాజ ఇంధనాల ఆధారిత యంత్రాలను సురక్షితంగా విద్యుద్దీకరించేందుకు ఐఐటీ మద్రాస్‌తో కలసి సీఐఎల్ పనిచేస్తోంది. సమాచార ప్రసారం, యాంత్రీకరణ, సిమ్యులేషన్ కోసం భూగర్భగనుల్లో 5జీ నెట్‌వర్కులు, డిజిటల్ ట్విన్స్, స్వయంచాలిత పర్యవేక్షణా రోవర్లను అభివృద్ధి చేస్తున్నారు.

స్మార్ట్ మౌలిక సదుపాయాలు, శుద్ధి, పర్యావరణం

  • రిమోట్ కమాండ్, నియంత్రణ కోసం వేగం, లోడ్, ఉష్ణోగ్రతను పర్యవేక్షించే పీఎల్‌సీ ఆధారిత హెచ్ఎంఐ, ఐవోటీ ఆధారిత పర్యవేక్షణతో కూడిన స్మార్ట్ కన్వేయర్ వ్యవస్థలు.

  • పొడి బొగ్గు శుద్ధి కోసం ఎయిర్ టేబుల్, డ్రై జిగ్గింగ్, కోల్ విన్నోవింగ్, ఎక్స్‌ఆర్‌టీ సార్టింగ్ ప్రస్తుతం పరిశోధన దశలో ఉన్నాయి. 

  • సీఏఏక్యూఎంఎస్, సీఈక్యూఎంఎస్ పర్యవేక్షణ, ఏఐ ఆధారంగా దుమ్మును అంచనా వేయడం, జీఐఎస్/ఉపగ్రహాలు/డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ, జీరో లిక్విడ్ డిశ్చార్జి వ్యవస్థలు, గనుల్లో తవ్వి తీసిన ఓవర్ బర్డెన్‌ను ఇసుకగా మార్చి వినియోగించడం.

డిజిటల్, సంస్థాగత ప్రణాళిక

రియల్-టైమ్ పర్యవేక్షణ, ముందస్తు నిర్వహణ, రిమోట్ కార్యకలాపాల కోసం 5జీ, ఐవోటీ, ఏఐ/ఎంఎల్, ఎడ్జ్ కంప్యూటింగ్, అధునాతన ఆటోమేషన్‌లను ఉపయోగించాలని సీఐఎల్ భావిస్తోంది. దీనిద్వారా గనులను క్రమంగా సాంకేతికతతో అనుసంధానించి, డేటా ఆధారిత ఆటోమేటెడ్ గనులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. బొగ్గు అగ్ని ప్రమాదాలు, గనుల మూసివేత, అడవుల పెంపకం, ఆర్ అండ్ ఆర్ పనులను పర్యవేక్షించేందుకు ఎన్ఆర్‌ఎస్‌సీ సహకారంతో భువన్ జియోస్పేషియల్ డ్యాష్‌బోర్డ్‌ను రూపొందిస్తోంది. సమాచార భద్రతా నిర్వహణను (ఐఎస్ఎంఎస్) మరింత పటిష్టం చేస్తూ, ఇప్పటికే 7 గనుల్లో పరీక్షించిన 17 డిజికోల్ పరిష్కారాలను అన్ని ప్రధాన గనులలో అమలు చేయనున్నారు.

పరిశోధన, అభివృద్ధి

2024-25 ఆర్థిక సంవత్సరంలో హబ్–అండ్–స్పోక్ విధానంలో పనిచేసే నేషనల్ సెంటర్ ఫర్ కోల్ అండ్ ఎనర్జీ రీసెర్చ్ (ఎన్ఏసీసీఈఆర్) ప్రాథమిక ప్రతిపాదనల దశ నుంచి ప్రోటోటైప్ అభివృద్ధి (టీఆర్ఎల్–4, అంతకంటే ఎక్కువ) దిశగా దృష్టి సారించడంతో సీఐఎల్ పరిశోధనాభివృద్ధిలో వేగం పెరిగింది. మూడు ఎక్సలెన్సీ కేంద్రాలైన క్లీన్జ్ (ఐఐటీ హైదరాబాద్), సీఎస్‌ఈ (ఐఐటీ మద్రాస్), ఐమిన్ (ఐఐటీ–ఐఎస్ఎం ధనబాద్) 13 హై–టీఆర్ఎల్, 11 లో–టీఆర్ఎల్ ప్రాజెక్టులను నిర్వహిస్తున్నాయి. వీటిలో భూగర్భ కోల్ గ్యాసిఫికేషన్ (కస్తా, ఈసీఎల్), ఓసీ, యూజీ గనుల్లో 5జీ, స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పెరోవ్‌స్కైట్ సోలార్ సెల్స్ (ఐఐటీ, బాంబే సహకారంతో), ఎస్ఈసీఎల్ పరిధిలో చుర్చా యూజీ గనిలో ప్రయోగ దశలో ఉన్న 500 టన్నుల సెల్ఫ్ అడ్వాన్సింగ్ గోఫ్  ఎడ్జ్ సపోర్ట్స్ (ఎస్ఏజీఈఎస్) లాంటి కీలకమైన ప్రాజెక్టులు ఉన్నాయి.

ఆర్థిక సంవత్సరం 2030 నాటికి ఆర్ అండ్ డీ ప్రణాళిక

  • ఆర్ అండ్ డీ ప్రాజెక్టులు, ఎక్సలెన్స్ సెంటర్ల కోసం ఆర్థిక సంవత్సరం 30 నాటికి రూ.1,900 కోట్ల పెట్టుబడులు.

  • గ్యాసిఫికేషన్, బ్యాటరీ రీసైక్లింగ్, బొగ్గు ఆధారిత పొరల కోసం పైల్ స్థాయి ప్లాంట్లు,  ఐఐటీ బాంబే/రూర్కీ/ఖరగ్‌పూర్/ఢిల్లీల్లో కొత్త సీవోఈలు, ఈశాన్య భారతంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు.

  • పైలట్ ఇంటిగ్రేటెడ్ కోల్ రిఫైనరీ కాంప్లెక్స్, శాశ్వత ఎన్ఏ‌సీసీఈఆర్ కేంద్రం ఏర్పాటు, హైడ్రోకైనెటిక్ పంప్డ్ స్టోరేజ్, కోటెడ్ స్పెరికల్ ప్యూరిఫైడ్ గ్రాఫైట్, డ్రై కోల్ బెనిఫిసియేషన్ విభాగాల్లో నూతన ప్రాజెక్టులు 

భారీ మూలధన అవసరాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, విభిన్న భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా అంతర్జాతీయ సాంకేతికతలను స్వీకరించడం లాంటి సవాళ్లు భారత మైనింగ్ రంగంలో ఇంకా కొనసాగుతున్నాయి. సామర్థ్యాల పెంపు, అనుకూల విధానాల అండతో ఆటోమేషన్, రోబోటిక్స్, కృత్రిమ మేధ (ఏఐ), హరిత మైనింగ్ సాంకేతికతలను మరింత విస్తృతంగా అనుసంధానించడంలో సీఐఎల్ ప్రయాణం నిర్వచితమవుతుంది. తద్వారా సురక్షితమైన, సమర్థవంతమైన, సుస్థిరమైన మైనింగ్ వ్యవస్థ నిర్మాణంలో ఆవిష్కరణలు, పరిశోధన, నైపుణ్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. 

 

 

***


(రిలీజ్ ఐడి: 2310495) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Tamil