సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
కొబ్బరిపీచు నుంచి పరిశ్రమల వరకు: గ్రామీణ జీవితాలను మార్చిన కొబ్బరిపీచు గ్రామీణ పరిశ్రమలు, మహిళా సాధికారత, స్థిరమైన జీవనోపాధికి ఊతం
నాడు పోస్టు చేయడమైనది:
14 SEP 2026 2:07PM by PIB Hyderabad
భారతదేశంలోని కొబ్బరి సాగు చేసే ప్రాంతాల్లో కొబ్బరిపీచు ఉపాధి, వ్యాపార వనరుగా మారుతోంది. సహజమైన, మన్నికైన, పర్యావరణహితమైన సహజ నార అయిన కొబ్బరిపీచు... తరతరాలుగా గ్రామీణ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో భాగంగా ఉంది. దీన్ని మ్యాట్లు, తాళ్లు, హస్తకళలు, జీవ-ఎరువులు, వినూత్న ప్యాకేజింగ్ పరిష్కారాల వరకు విలువ ఆధారిత ఉత్పత్తులుగా మారుస్తున్నారు. వేలాది మంది గ్రామీణ పారిశ్రామికవేత్తలు కళాకారులు ఈ విప్లవాత్మక మార్పునకు కారణం. వీరు సంప్రదాయ కార్యకలాపాన్ని ఆధునిక ఉపాధి మార్గాలుగా మలుస్తున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ మద్దతుతో, ముఖ్యంగా కొబ్బరినార బోర్డు, ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) ద్వారా కొబ్బరిపీచు పరిశ్రమ స్వయం ఉపాధికి, మహిళా సాధికారతకు, స్థానిక ఆర్థికాభివృద్ధికి కీలకంగా మారుతోంది.
కొబ్బరిపీచు వ్యర్థాలను లాభసాటి వ్యాపారంగా మార్చటం
1. ఒక పరిశ్రమ, 120 మంది మహిళలు, లెక్కలేనన్ని అవకాశాలు
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కడియంలో శ్రీమతి అల్లం గౌతమి... కొబ్బరిపీచు, కొబ్బరి వ్యర్థాలను విజయవంతమైన వ్యాపారంగా మలిచారు. ధవళేశ్వరంలోని కొబ్బరినార బోర్డు శిక్షణ కేంద్రంలో ఆమె ప్రత్యేక శిక్షణ పొందారు. పీఎంఈజీపీ సహాయం, రూ. 6.50 లక్షల బ్యాంకు రుణంతో రూ. 10 లక్షల ప్రాజెక్టు వ్యయంతో 2024-25 సంవత్సరంలో ఎడిగో కాయిర్ ప్రొడక్ట్స్ సంస్థను స్థాపించారు. ఈ యూనిట్ ద్వారా ప్రస్తుతం పర్యావరణహిత డోర్మ్యాట్లు, తాళ్లు, అలంకరణ బొమ్మలు, హస్తకళా వస్తువులు తయారవుతున్నాయి.
ఈ సంస్థ దాదాపు రూ.35 లక్షల వార్షిక టర్నోవర్‌ను, సుమారు రూ.10 లక్షల లాభాన్ని సాధించటంతో పాటు, ఆరుగురు మహిళలకు ప్రత్యక్ష ఉపాధిని కల్పిస్తోంది. ఆమె ప్రభావం కేవలం సొంత సంస్థకే పరిమితం కాలేదు. కొబ్బరినారతో మ్యాట్లను తయారుచేయటం, తాళ్ల తయారీ, హస్తకళల ఉత్పత్తిలో దాదాపు 120 మంది మహిళలకు శిక్షణనిచ్చి, వారు జీవనోపాధి అవకాశాలను పెంపొందించుకునేలా సహాయం చేశారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా సమీప ప్రాంతాల్లో మరో 5 కాయిర్ యూనిట్ల ఏర్పాటునకు ఆమె విజయం స్ఫూర్తినిచ్చింది.
2. శ్రీ సురేంద్రన్ పర్యావరణహిత కొబ్బరినార విజయగాథ
కొబ్బరినార వ్యర్థాన్ని స్థిరమైన వ్యవసాయానికి అవకాశంగా మలచుకుంటూ... 2024 నవంబర్‌లో కేరళలోని కోజికోడ్‌లో సంపూర్ణ ప్లస్ అగ్రో ఫెర్టిలైజర్ ఎంటర్‌ప్రైజెస్ (సేఫ్)ను శ్రీ పి. సురేంద్రన్ స్థాపించారు. ఆయన కన్నూరులోని కొబ్బరినార బోర్డు కలవూరులోని సెంట్రల్ కాయిర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీసీఆర్‌ఐ) నుంచి శిక్షణ, సాంకేతిక మద్దతును పొందారు. నేల సారాన్ని, తేమను నిలుపుకునే శక్తిని పెంపొందించే పర్యావరణహిత సేంద్రీయ కొబ్బరిపీచు ఎరువును ఉత్పత్తి చేయటం ప్రారంభించారు.
కేవలం ఒక్క ఏడాదిలోనే ఆ సంస్థకు 500 మందికి పైగా వినియోగదారులుగా మారారు. 20 టన్నులకు పైగా జీవ-ఎరువులను విక్రయించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 13 లక్షల టర్నోవర్‌తో పాటు రూ. 4 లక్షల లాభాన్ని ఆర్జించింది. ఈ యూనిట్ ఇద్దరు మహిళలతో సహా ఐదుగురికి ఉపాధి కల్పిస్తూ స్థానికంగా ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది. కొబ్బరిపీచు వ్యర్థాల నుంచి స్థిరమైన వ్యాపారం దిశగా సాగిన అతని ప్రయాణం... ఆర్థిక విలువ తక్కువగా గల వస్తువుల నుంచి కూడా నూతన వ్యాపార అవకాశాలను సృష్టించేందుకు ఆవిష్కరణ, సాంకేతిక మద్దతు ఏ విధంగా దోహదపడతాయో నిరూపిస్తోంది.
గ్రామీణ భారతంలో కొబ్బరిపీచుకు ఎందుకంత ప్రాధాన్యత
భారతదేశపు ప్రాచీన సహజనారల్లో కొబ్బరిపీచు ఒకటి. భారతదేశంలో వ్యవస్థీకృత కొబ్బరిపీచు ఉత్పత్తి... కేరళలోని అలప్పుజలో మొదటి పీచు కర్మాగారం ఏర్పాటుతో 1859లో ప్రారంభమైంది. అప్పటినుంచి ఈ రంగం ప్రధాన కొబ్బరి ఉత్పత్తి ప్రాంతాలన్నింటికీ విస్తరించింది. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద కొబ్బరిపీచు ఉత్పత్తిదారుగా ఉంది. ప్రపంచ కొబ్బరిపీచు ఉత్పత్తిలో భారత్‌ది 80 శాతానికి పైగా వాటా ఉంది. ఈ పరిశ్రమకు మహిళల జీవనోపాధితో కూడా ప్రత్యక్ష సంబంధం ఉంది. పీచును వేరుచేయటం, వడకటంలో నిమగ్నమైన వారిలో దాదాపు 80 శాతం మంది మహిళలే. ఇది కొబ్బరి రైతులు, కార్మికులు, మహిళా హస్తకళాకారులు, సహకార సంఘాలు, పారిశ్రామికవేత్తలు, తయారీదారులు, ఎగుమతిదారులను అనుసంధానించే ముఖ్యమైన గ్రామీణ జీవనోపాధి రంగంగా కొబ్బరిపీచు పరిశ్రమను మారుస్తోంది.
పీచు నుంచి తుది ఉత్పత్తి వరకు
ముడి పీచు ఉత్పత్తికి మాత్రమే పరిమితం కాకుండా మరింతగా విస్తరించే సామర్థ్యం కొబ్బరిపీచుకు ఉంది. ప్రాసెసింగ్, డిజైన్, ఆవిష్కరణల ద్వారా అధిక విలువ గల అనేక రకాల ఉత్పత్తులుగా దీన్ని మార్చవచ్చు. వాటిలో కొన్ని:
-
మ్యాట్స్, డోర్ మ్యాట్స్
-
తాళ్లు, నూలు
-
బ్రష్‌లు, ఇతర గృహోపకరణాలు
-
అలంకరణ వస్తువులు, హస్తకళా ఉత్పత్తులు
-
తోటపని, ఉద్యానవన ఉత్పత్తులు
-
నూతన, పర్యావరణ అనుకూల ప్యాకేజింగ్ పరిష్కారాలు
కొబ్బరిపీచు సరఫరా వ్యవస్థకు మద్దతు
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని చట్టబద్ధ సంస్థ కొబ్బరినార బోర్డు. నైపుణ్యాభివృద్ధి, సాంకేతికత, పరిశోధన, మార్కెట్ ప్రోత్సాహం, ఎగుమతులు, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ రంగాన్ని బలోపేతం చేయటానికి ఇది కృషి చేస్తోంది.
సాంకేతికత, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, మహిళలకు శిక్షణ, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ ప్రోత్సాహం, పరిశ్రమల అభివృద్ధి, కార్మికుల సంక్షేమం వంటి రంగాలకు కాయిర్ వికాస్ యోజన (సీవీవై) మద్దతిస్తుంది. కాయిర్ రంగ వ్యక్తులు నూతన నైపుణ్యాలను పొందటం, మెరుగైన సాంకేతికతను అందిపుచ్చుకోవటం, నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయటం, పెద్ద మార్కెట్లకు విస్తరించటం ఈ పథక ముఖ్య ఉద్దేశం. ప్రదర్శనలు, మేళాలు, షోరూమ్‌లు, ఎగుమతి ప్రోత్సాహక కార్యకలాపాలు కాయిర్ ఉత్పత్తిదారుల ఉత్పత్తులను ప్రదర్శించటానికి, నూతన వినియోగదారులను, మార్కెట్లను చేరుకోవటానికి ఎంతగానో దోహదపడుతున్నాయి.
ఆవిష్కణ: కొబ్బరి నారకు నూతన గుర్తింపు
హెచ్‌డీపీఈ ప్లాస్టిక్ కప్పులకు ప్రత్యామ్నాయంగా పర్యావరణహిత కొబ్బరినార రైలు వీల్ యాక్సిల్ ప్యాకింగ్ కప్పులను సెంట్రల్ కాయిర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసింది. ఇలాంటి ఆవిష్కరణలు, సంప్రదాయ సహజ నార ఆధునిక పరిశ్రమల్లో ఎలా ఉపయోగపడుతున్నాయో, పర్యావరణ బాధ్యతతో కూడిన ఉత్పత్తికి ఎలా సహకరిస్తున్నాయో తెలియజేస్తున్నాయి.
గొప్ప లక్ష్యం గల ఫైబర్
శ్రీమతి అల్లం గౌతమి, శ్రీ జి. సాబు కథలు భారతదేశ కొబ్బరినార రంగం మారుతున్న తీరును తెలియజేస్తున్నాయి. నైపుణ్యాలు, ఆర్థిక సహాయం, సాంకేతికత, పరిశోధన, మార్కెట్ మద్దతుతో భారతదేశంలోని సంప్రదాయ కొబ్బరినార రంగం క్రమంగా అధిక విలువ గల ఉత్పత్తులు, ఆధునిక వ్యాపార సంస్థల దిశగా అడుగులు వేస్తోంది. దీనివల్ల స్థానికంగా లభించే వనరులు, వ్యవస్థాపకతకు, సంక్షేమానికి గొప్ప అవకాశాలుగా మారుతున్నాయి.
మరింత సమాచారం కోసం ఈ వెబ్‌సైట్‌ను సంప్రదించండి: https://coirboard.gov.in/
***
(రిలీజ్ ఐడి: 2310209)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11